INDIA VS ENGLAND 2021: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అరుదైన రికార్డు నమోదైంది. భారత జట్టు పేరుపై ఉన్న రికార్డును ఇంగ్లాండ్ బద్దలు కొట్టింది. ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క అదనపు పరుగు(ఎక్స్‌ట్రా రన్) ఇవ్వకుండా అత్యధిక స్కోర్ 329 అందించిన జట్టుగా నిలిచింది. ఆదివారం 300/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 29 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు ఈ ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క అదనపు పరుగూ ఇవ్వలేదు. దీంతో భారత్ పేరిట ఉన్న ఆ అరుదైన రికార్డును ఇంగ్లాండ్ తన పేరిట లిఖించుకుంది.1954/55లో లాహోర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి 328 పరుగులిచ్చింది. అందులో ఒక్క ఎక్స్‌ట్రా కూడా లేకపోవడం విశేషం. ఇప్పుడదే రికార్డును ఇంగ్లాండ్ బద్దలుకొట్టింది.
అజింక్యా మా అగ్రశేణి ఆటగాళ్లలో ఒకడు.. అవసరమైన ప్రతిసారి అండగా నిలుస్తాడంటున్న హిట్‌మ్యాన్..