ఈ ప్లేయర్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్(All Rounder)గా పేరుగాంచాడు. అయితే ప్రారంభంలో తన కెరీర్‌ను 11వ నంబర్‌లో బ్యాట్స్‌మెన్‌గా మొదలుపెట్టాడు. అయితే తన అద్భుతమైన ప్రదర్శనతో ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌కు చేరుకున్నాడు. ఆయన పేరే విల్ఫ్రెడ్ రోడ్స్(wilfred rhodes). ఇంగ్లండ్ పాత కాలపు దిగ్గజ ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన ఆయన.. 52 సంవత్సరాల 165 రోజుల వయసులో టెస్ట్ క్రికెట్(Cricket) నుండి రిటైర్ అయ్యాడు. ఈ రోజు (ఏప్రిల్ 12) 1930లో, వెస్టిండీస్‌తో జమైకా టెస్టు విల్‌ఫ్రెడ్ రోడ్స్‌కు చివరి టెస్ట్. రోడ్స్ 1877లో జన్మించాడు. కుడిచేతితో బ్యాటింగ్ చేయడమే కాకుండా, ఎడమ చేతితో బౌలింగ్ చేసిన రోడ్స్ 58 టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
1110 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు..
ఇంగ్లండ్‌కి చెందిన ఈ లెజెండరీ క్రికెటర్ 1110 ఫస్ట్ క్లాస్ (1898-1930) మ్యాచ్‌లు ఆడాడని తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అతను తప్ప మరే ఆటగాడు ఇప్పటివరకు వెయ్యి మ్యాచ్‌ల సంఖ్యను టచ్ చేయలేకపోవడం విశేషం. అత్యధిక మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ తరపున ఆడిన ఫ్రాంక్ వూలీ పేరు రెండో స్థానంలో (978 మ్యాచ్‌లు) ఉంది.
52 సంవత్సరాల 165 రోజుల వయస్సులో రిటైర్మెంట్..
విల్‌ఫ్రెడ్ రోడ్స్ ఎక్కువ కాలం టెస్టు క్రికెట్ ఆడిన రికార్డును కలిగి ఉన్నాడు. అతను 1930లో వెస్టిండీస్‌పై 52 సంవత్సరాల 165 రోజుల వయస్సులో మైదానంలోకి వచ్చాడు. ఇదే అతని చివరి టెస్టు.
30 ఏళ్లకు పైగా టెస్ట్ కెరీర్..
సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించడం గురించి మాట్లాడితే, రోడ్స్ టెస్ట్ కెరీర్ 30 సంవత్సరాలకుపైగా (30 సంవత్సరాల 315 రోజులు) కొనసాగింది. అతడు తప్ప మరెవ్వరికీ 30 ఏళ్ల పాటు టెస్టు కెరీర్‌ను కొనసాగించలేకపోయారు. సచిన్ టెండూల్కర్ టెస్ట్ కెరీర్ 24 ఏళ్ల ఒకరోజు కొనసాగింది. ఈ లిస్టులో సచిన్ ఐదో స్థానంలో ఉన్నాడు.
సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ కెరీర్ కొనసాగించిన ప్లేయర్లు వీరే..
1. విల్‌ఫ్రెడ్ రోడ్స్ (ఇంగ్లండ్): 30 ఏళ్లు 315 రోజులు
2. బ్రియాన్ క్లోజ్ (ఇంగ్లండ్): 26 ఏళ్లు 356 రోజులు
3. ఫ్రాంక్ వూలీ (ఇంగ్లండ్): 25 ఏళ్లు 13 రోజులు
4. జార్జ్ హెడ్లీ (వెస్టిండీస్): 24 ఏళ్లు 10 రోజులు
5 సచిన్ టెండూల్కర్ (భారతదేశం): 24 సంవత్సరాల 1 రోజు
4000 వికెట్ల మార్కును దాటిన తొలి ప్లేయర్..
విల్‌ఫ్రెడ్ రోడ్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16.72 సగటుతో 4204 వికెట్లు తీశాడు. ప్రపంచంలోనే 4000 వికెట్ల మార్క్‌ను దాటిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన టిక్ ఫ్రీమాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3776 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
విల్‌ఫ్రెడ్ రోడ్స్ తన టెస్ట్ కెరీర్‌లో 30.19 సగటుతో 2325 పరుగులు చేశాడు. అలాగే 127 వికెట్లు కూడా తీసుకున్నాడు. అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 30.81 సగటుతో 39969 పరుగులు చేసి, ఇందులో 58 సెంచరీలు చేశాడు. ఈ అనుభవజ్ఞుడు 1973లో 95 సంవత్సరాల వయసులో మరణించాడు.
Ravichandran Ashwin: అందుకే అలాంటి నిర్ణయం.. రిటైర్డ్ ఔట్‌పై క్లారిటీ ఇచ్చిన అశ్విన్.. ఏమన్నాడంటే?