Stuart Broad: ఇంగ్లాండ్ దిగ్గజానికి ఆసీస్ ప్లేయర్ల గాడ్ ఆఫ్ హానర్‌.. చివరి టెస్ట్‌లో కనిపిస్తున్న బ్రాడ్..

|

Jul 30, 2023 | 6:26 PM

Stuart Broad: టెస్టుల్లో 600 వికెట్లు తీసుకున్న 7వ బౌలర్‌గా ఇటీవలే అవతరించిన బ్రాడ్ ఇలా అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం తన టీమ్‌మేట్ జిమ్మీ అండర్సన్‌తో కలిసి బ్రాడ్ బ్యాటింగ్‌కి వస్తున్న సమయంలో.. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లంతా అతనికి గాడ్ ఆఫ్ హానర్ అందించారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు స్టాడింగ్..

Stuart Broad: ఇంగ్లాండ్ దిగ్గజానికి ఆసీస్ ప్లేయర్ల గాడ్ ఆఫ్ హానర్‌.. చివరి టెస్ట్‌లో కనిపిస్తున్న బ్రాడ్..
Australia's guard of honour to Stuart Broad
Follow us on

Stuart Broad: ఇంగ్లీష్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుతమైన బౌలింగ్ ఫామ్‌తో ఉండగానే క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఓవల్‌లో ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగానే ఇది తనకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని బ్రాడ్ ప్రకటించాడు. టెస్టుల్లో 600 వికెట్లు తీసుకున్న 7వ బౌలర్‌గా ఇటీవలే అవతరించిన బ్రాడ్ ఇలా అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం తన టీమ్‌మేట్ జిమ్మీ అండర్సన్‌తో కలిసి బ్రాడ్ బ్యాటింగ్‌కి వస్తున్న సమయంలో.. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లంతా అతనికి గాడ్ ఆఫ్ హానర్ అందించారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు స్టాడింగ్ ఓవేషన్‌తో పాటు చప్పట్లు మిన్నంటించారు. ఈ క్రమంలో బ్రాడ్ చివరిసారిగా మైదానంలోకి అడుగు పెడుతూ ఒకింత ఎమోషనల్ అయ్యాడు.

బ్రాడ్ తన కెరీర్ ప్రారంభంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ చేతిలో భంగపడ్డప్పటికీ.. మైదానంలో ప్రేక్షకులను నిరాశపరచలేదు. 17 ఏళ్లుగా ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న బ్రాడ్ ఇంగ్లీష్ జట్టుకు అద్భుతమైన సేవలు అందించాడు. బ్రాడ్ తన కెరీర్‌లో 167 టెస్టులు ఆడి ఏకంగా 602 వికెట్లు తీసుకున్నాడు. తన చివరి టెస్టు ఇంకా జరుగుతున్న క్రమంలో ఇంకొన్ని వికెట్లు తీసుకునే అవకాశం అతనికి ఉంది. బ్యాటింగ్‌లోనూ 3,662 టెస్టు పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు కూడా ఉండడం విశేషం. ఇంకా ఇంగ్లాండ్ తరఫున 121 వన్డేలు ఆడి 178 వికెట్లు తీసుకోవడంతో పాటు 529 పరుగులు చేశాడు. అలాగే 56 టీ20 మ్యాచ్‌లు ఆడి 65 వికెట్ల పడగొట్టి, బ్యాటింగ్‌లో 118 పరుగులు సాధించాడు.


కాగా, స్టువర్ట్ బ్రాడ్ తన రిటైర్‌మెంట్ గురించి ముందుగా తన టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పాడంట. మరోవైపు ఆదివారం 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన చిరకాల మిత్రుడు, టీమ్‌మేట్ అండర్సన్‌కి ఈ విషయం శనివారమే తెలిసి ఆశ్చర్యపోయాడు. ఏదేమైనప్పటికీ స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్ తరఫున మొత్తంగా 845* వికెట్లు తీసుకుని ఆ జట్టుకు అద్భుతమైన సేవలు అందించడంతో పాటు గొప్ప బౌలర్‌గా ఘనత సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..