Dinesh Karthik: IPL 2022లో దినేష్ కార్తీక్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోను ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ తీసుకోండి. ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ 4 ఏళ్ల ఫీట్‌ని మళ్లీ రిఫీట్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌లో అది 18వ ఓవర్. బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఈ ఓవర్ వేశాడు. దినేశ్ కార్తీక్ ఊచకోత కోశాడు. ఒక్క ఓవర్లో 28 పరుగులు కొల్లగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ప్రతి బంతి బౌండరీ దాటింది. ఒకే ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
ప్రతి బంతి వివరాలు
మొదటి బంతి: 4 పరుగులు. కీపర్, షార్ట్ థర్డ్‌మ్యాన్ మధ్య నుంచి ఫోర్ వెళ్లింది.
రెండో బంతి : 4 పరుగులు. ఇది రివర్స్ అప్పర్ కట్ షాట్. ఫోర్ వెళ్లింది.
మూడో బంతి: 4 పరుగులు. కవర్ డ్రైవ్ ఆడటంతో ఫోర్ వెళ్లింది.
నాలుగో బంతి: 6 పరుగులు. లాంగ్ ఆఫ్‌లో సిక్స్.
ఐదో బంతి: 6 పరుగులు. యార్కర్‌ని సిక్స్‌గా మలిచాడు.
ఆరో బంతి: 4 పరుగులు. చివరి బంతికి ఫోర్ కొట్టిన దినేష్ కార్తీక్. ఈ ఓవర్లో 28 పరుగులు కొల్లగొట్టాడు.
4 ఏళ్ల క్రితం నిదహాస్ ట్రోఫీలో ఇలాగే పరుగుల వర్షం..
ముస్తాఫిజుర్ రెహమాన్ ఓవర్‌లో దినేష్ కార్తీక్ పరుగుల వర్షం కురిపించడం చూస్తుంటే 4 ఏళ్ల క్రితం జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గుర్తుకు వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన నిదాహాస్ ట్రోఫీ టీ20 సిరీస్ ఫైనల్లో దినేష్ కార్తీక్ కేవలం 8 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఈ 8 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. కార్తీక్ పేలుడు ఆటతో భారత్ ఫైనల్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.