T20 World Cup: ఇండియా ఓటమికి పేలవ ప్రదర్శనే కారణం.. టాస్ కాదు.. తేల్చిచెప్పిన హర్భజన్..

|

Nov 08, 2021 | 4:01 PM

టీ20 ప్రపంచకప్‌లో భారత్ టాస్‌లు గెలిస్తే పరిస్థితులు మరోలా ఉండేవని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ చేసిన వ్యాఖ్యలతో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విభేదించాడు. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఆఖరి మ్యాచ్‎కు అరుణ్ పలు వ్యాఖ్యలు చేశాడు...

T20 World Cup: ఇండియా ఓటమికి పేలవ ప్రదర్శనే కారణం.. టాస్ కాదు.. తేల్చిచెప్పిన హర్భజన్..
Arunu
Follow us on

టీ20 ప్రపంచకప్‌లో భారత్ టాస్‌లు గెలిస్తే పరిస్థితులు మరోలా ఉండేవని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ చేసిన వ్యాఖ్యలతో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విభేదించాడు. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఆఖరి మ్యాచ్‎కు అరుణ్ పలు వ్యాఖ్యలు చేశాడు. టాస్, బయో బబుల్ అలసట కారణంగా ఇండియా ఓడిపోయిందని అన్నారు. పాకిస్తాన్, న్యూజిలాండ్‎పై ఓడిపోవడానికి టాస్ గెలవకపోవటం ఒక కారణంగా చెప్పుకొచ్చాడు. అయితే హర్భజన్ సింగ్ అరుణ్ మాటలతో ఏకీభవించలేదు. భారత్ ప్రపంచ కప్ నుండి నిష్క్రమించడానికి కారణం పేలవమైన ప్రదర్శనేనని బజ్జీ స్పష్టం చేశాడు. ఇతర కారణాలు ఏవి లేవని చెప్పాడు. IPLలో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసినప్పటికీ ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించిందని గుర్తు చేశాడు.

“భారత్ టాస్ గెలిస్తే, వారు ఇలా చేసి, ఆ పని చేసి ఉండేవారని భరత్ అరుణ్ చెప్పడం నేను విన్నాను. అదంతా తరువాత చర్చకు సంబంధించినది. మీరు ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నా లేదా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నా సరే… అలా కాదు. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో గెలిచిందా? వారు 190 పరుగులు చేశారు, కాబట్టి మీరు పరుగులు చేయాలి. మనం సరిగ్గా ఆడలేదు.మేము అంచనాలను అందుకోలేకపోయాము అనే వాస్తవాన్ని అంగీకరిస్తాం” అని హర్భజన్ అన్నాడు.

Read Also.. Kapil Dev: భారత జట్టు కంటే ఐపీఎల్‎కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు ఉన్నారు.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..