Sai Kishore : సోషల్ మీడియాకు దూరం.. కనీసం ఫోన్ చేసినా ఎత్తడు.. భారత క్రికెటర్ షాకింగ్ వ్యాఖ్యలు

ఎంఎస్ ధోనీ మైదానంలో ఎంత కఠిన పరిస్థితుల్లోనైనా అతను ప్రశాంతంగా ఉంటాడు. టీమ్ ఇండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరైన ధోనీ, ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‎కు 5 సార్లు ఛాంపియన్‌షిప్ అందించాడు. కోట్ల మంది యువకులకు ధోనీ ఆదర్శం, అయితే అతను సోషల్ మీడియాకు మాత్రం చాలా దూరంగా ఉంటాడు. ధోనీతో పాటు సీఎస్కే జట్టులో భాగమైన సాయి కిషోర్, ధోనీ ఫోన్ అస్సలు ఎత్తడని, అది ఎలా తనపై ప్రభావం చూపిందో వెల్లడించారు.

Sai Kishore : సోషల్ మీడియాకు దూరం.. కనీసం ఫోన్ చేసినా ఎత్తడు.. భారత క్రికెటర్ షాకింగ్ వ్యాఖ్యలు
Ms Dhoni

Updated on: Oct 03, 2025 | 11:35 AM

Sai Kishore : ఎంఎస్ ధోనీని కెప్టెన్ కూల్ అని ఊరికే అనరు. మైదానంలో ఎంత కఠిన పరిస్థితుల్లోనైనా అతను ప్రశాంతంగా, సంయమనంతో ఉంటాడు. టీమ్ ఇండియాకు అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్‌లలో ఒకరైన ధోనీ, ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‎ను 5 సార్లు ఛాంపియన్‌షిప్ అందించాడు. ధోనీ కోట్ల మంది యువకులకు ఆదర్శం, అయితే అతను సోషల్ మీడియాకు మాత్రం చాలా దూరంగా ఉంటాడు. ధోనీతో పాటు సీఎస్కే జట్టులో భాగమైన భారత క్రికెటర్ సాయి కిషోర్, ధోనీ ఫోన్ అస్సలు ఎత్తడని, అది ఎలా తనపై ప్రభావం చూపిందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఐపీఎల్ ఆడిన భారత క్రికెటర్లు లేదా విదేశీయులు అయినా సరే, అందరూ ధోనీ కెప్టెన్సీని, అతని ప్రవర్తనను పొగుడుతూనే ఉంటారు. అతను ఆటగాళ్లతో బాగా కనెక్ట్ అవుతాడు. వారి నుండి విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. అయితే సాయి కిషోర్ మాత్రం ధోనీ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

సాయి కిషోర్ ఐపీఎల్ కెరీర్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో ప్రారంభమైంది. అప్పుడు CSK అతన్ని 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. రెండు సీజన్‌లలో జట్టులో భాగమైనప్పటికీ, అతనికి ఆడే అవకాశం రాలేదు. 2022లో, గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అతన్ని 3 కోట్ల రూపాయలకు కొని తమ జట్టులో చేర్చుకుంది. CSK లో ఉన్నప్పుడు ధోనీ నుండి తాను ఏమి నేర్చుకున్నాడో సాయి కిషోర్ వివరించారు.

ప్రోవోక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి కిషోర్ మాట్లాడుతూ.. “నేను ఎంఎస్ ధోనీ నుంచి చాలా నేర్చుకున్నాను. అతను తన ఫోన్ అస్సలు ఎత్తేవాడు కాదు. మ్యాచ్‌లకు వెళ్ళేటప్పుడు తన ఫోన్‌ను హోటల్ రూమ్‌లోనే వదిలిపెట్టి వెళ్ళేవాడు. అతను సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండేవాడని చెప్పారు.

“సోషల్ మీడియాకు కనెక్ట్ అయి ఉండటం నిజంగా అవసరమా అని నేను నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని. అందుకే అతన్ని చూసి నాకు స్ఫూర్తి కలిగింది” అని సాయి కిషోర్ అన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి క్రికెటర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇది డబ్బు సంపాదించడానికి, అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి ఒక మార్గం కూడా. కానీ ఎంఎస్ ధోనీ మాత్రం సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటాడు. పండుగలైనా, ఎవరి పుట్టినరోజైనా లేదా ఏదైనా పెద్ద ఈవెంట్ అయినా, ధోనీ చాలా అరుదుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు.

ధోనీ ఈ ప్రశాంతమైన లైఫ్ స్టైల్, ఫోన్‌కు, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వంటి అలవాట్లే అతను మైదానంలో కెప్టెన్ కూల్‎గా ఉండటానికి ఒక ప్రధాన కారణమని సాయి కిషోర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఇది యువ క్రికెటర్లకు, సాధారణ ప్రజలకు కూడా ఒక మంచి గుణపాఠం.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి