
చెన్నై: ఐపిఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చైన్నై స్టేడియం దద్దరిల్లింది. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ధోనీ చెన్నై స్టేడియంలోకి రాగానే ప్రేక్షకులంతా గట్టిగా అరిచారు. ధోనీ బ్యాట్ పట్టుకొని స్టేడియంలోకి వచ్చేటప్పుడు.. ధోనీ.. ధోనీ.. అంటూ అభిమానులంతా కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ఆ స్పందన చూసిన ధోనీ చిరునవ్వులు చిందించాడు.
అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిరింది. ఈ సందర్భంగా తీసిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్టు చేయగా అభిమానులు విపరీతంగా షేర్లు చేస్తున్నారు. చెపాక్ స్టేడియంలో ధోనీకి వచ్చిన ఈ స్పందన చూసి సహచర ఆటగాళ్లు, కోచ్‌లు స్టేడియం సిబ్బంది అందరూ ఆశ్చర్యానికీ గురయ్యారు.
Whistle parakkum paaru! #ThalaParaak #WhistlePodu #Yellove ?? pic.twitter.com/6EeMkYT0QY
— Chennai Super Kings (@ChennaiIPL) March 17, 2019