
MS Dhoni CSK Future Shares Dispute: టీమిండియా మాజీ ప్లేయర్, చెన్నై మాజీ కెప్టెన్ ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడడంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాదిలానే టీంతో జర్నీ చేస్తాడా లేదా అనే విషయంపైనా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీతో వాటాల విషయంలో తేడాలు వచ్చినట్లు, దీంతో ఇకపై చెన్నై జట్టుకు ధోని దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, కెప్టెన్‌గా సీఎస్కే ఫ్రాంచైజీని సంయుక్తంగా అత్యధికంగా5 టైటిళ్లకు, 10 ఫైనల్స్‌కు నడిపించిన ధోనీ, ఐపీఎల్‌లో ఆ జట్టు విజయానికి పర్యాయపదంగా మారిన సంగతి తెలిసిందే.
2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, 44 ఏళ్ల వయసులో కూడా చెన్నై జట్టుతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ 2023లో సీఎస్‌కేకు 5వ టైటిల్ అందించిన తర్వాత ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. ఈక్రమంలో చెన్నై టీం వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమైంది.
ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు చేయడం ద్వారా CSKతో తన అనుబంధాన్ని బలోపేతం చేసుకోవాలని ధోనీ కోరుకున్నట్లు సమాచారం. అయితే, ఆ చర్చలు విఫలమవడంతో ఇరు పక్షాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు IPLలో CSK తరపున 17 సీజన్‌లోనూ ధోనీ ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
ఎక్కువమంది చదివినది: SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబులో భారీ జంప్..?
క్రిక్‌బ్లాగర్ నివేదిక ప్రకారం, సీఎస్‌కేలో వాటాను కొనుగోలు చేయాలనే తన ఆసక్తిని ధోనీ వ్యక్తం చేశాడు. అయితే ఫ్రాంచైజీ మాత్రం ధోని షరతులను అంగీకరించలేదంట. ఆ నివేదిక ప్రకారం, ధోనీ సీఎస్‌కేలో 25% వాటాను కొనాలనుకున్నాడు, అయితే ప్రమోటర్లు కేవలం 3% మాత్రమే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో సీఎస్‌కే మాజీ కెప్టెన్ తన డిమాండ్‌ను 20% వాటాకు తగ్గించుకున్నాడు.
అయితే, యాజమాన్యం తమ ఆఫర్‌ను 4 శాతానికి మాత్రమే పెంచింది. పలు దఫాల చర్చల అనంతరం ధోనీ చివరకు ఫ్రాంచైజీలో 18 శాతం వాటా కోరగా, యాజమాన్యం తమ ఆఫర్‌ను 5.5 శాతానికి మాత్రమే పెంచడంతో ఆ ఒప్పందం రద్దయింది.
“ధోనీ సీఎస్కేలో వాటా కొనాలనుకున్నాడు. ఆ వాటాను కూడా ఉచితంగా అడగలేదు, కానీ CSK యాజమాన్యం వేరే విధంగా ఆలోచించింది,” అని క్రిక్‌బ్లాగర్ పేర్కొంది.
నివేదిక ప్రకారం, ధోనీ, సీఎస్‌కే మధ్య జరిగిన చర్చలు మౌఖికంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి పేపర్ వర్క జరగలేదు. వాటా చర్చలు విఫలమవ్వడంతో, ధోనికి, ఫ్రాంచైజీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని సమాచారం.
నివేదిక ప్రకారం, వాటా ఒప్పందం విఫలమవడంతో ధోనీ, సీఎస్‌కేల మధ్య సంబంధాలు ఎంతగా దెబ్బతిన్నాయంటే, ధోని మళ్లీ ఆ ఫ్రాంచైజీ తరపున ఆడకపోవచ్చు అని తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో ధోనీ సీఎస్‌కే జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ, గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదనే విషయం తెలిసిందే.
రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో CSKతో తన భవిష్యత్తుపై ధోనీ మౌనంగా ఉన్నాడు. గత ఏడాది మైదానంలోకి అడుగుపెట్టకపోయినప్పటికీ, చెన్నై జట్టుకు మార్గదర్శిగా కొనసాగుతున్నాడు. ధోనీ వచ్చే సీజన్‌లో CSK తరపున తిరిగి వచ్చి ప్రస్తుత మూడేళ్ల ఒప్పందాన్ని పూర్తి చేస్తాడా లేదా IPL నుంచి తప్పుకుంటాడా అనేది వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..