
Dewald Brevis : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో జూనియర్ ఏబీగా పిలిచే డేవిల్డ్ బ్రెవిస్ తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 56 బంతుల్లో 125 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత టీ20 స్కోరు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో బ్రెవిస్ 12 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా ముందు 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా డేవిల్డ్ బ్రెవిస్ నిలిచాడు. అతను ఫాఫ్ డు ప్లెసిస్ రికార్డును బద్దలు కొట్టాడు. డు ప్లెసిస్ 2015లో వెస్టిండీస్‌పై 119 పరుగులు చేశాడు. బ్రెవిస్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో రిచర్డ్ లెవీ (117), రీజా హెండ్రిక్స్ (114), మోర్నే వాన్ విక్ (114) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బ్రెవిస్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత చివరి వరకు అజేయంగా నిలిచి 125 పరుగులు చేశాడు. జట్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్ ట్రిస్టన్ స్టబ్స్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీనిని బట్టి బ్రెవిస్ ఒంటరిగానే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడని అర్థం చేసుకోవచ్చు.
డెవాల్డ్ బ్రెవిస్ తన చిన్న టీ20 కెరీర్‌లో ఆడుతున్నది ఇది కేవలం తొమ్మిదో మ్యాచ్ మాత్రమే. ఇంతకుముందు 8 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని బ్రెవిస్, ఈ 9వ ఇన్నింగ్స్‌లో ఏకంగా తొలి సెంచరీతో పాటు సెంచరీని కూడా దాటిపోయాడు. ఈ 125 పరుగుల ఇన్నింగ్స్‌తో బ్రెవిస్ టీ20 సగటు 20 నుంచి 37కి పైగా పెరిగిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..