టీమిండియా వద్దంది, ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ మాజీ టీంమేట్

|

Jan 16, 2025 | 2:37 PM

Devdutt padikkal: దేవదత్ పడిక్కల్ ఇప్పటికే టీమిండియా తరపున టెస్టు, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ, వన్డే జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేపోయాడు. అయితే, లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో అతను నిలకడగా రాణిస్తున్న పడిక్కల్.. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. అయితే భారత వన్డే జట్టులో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం ఇవ్వలేదు.

టీమిండియా వద్దంది, ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ మాజీ టీంమేట్
Devdutt Padikkal
Follow us on

ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ప్రారంభానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దేశవాళీ వేదికగా జరిగిన విజయ్ హజారే టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన కొందరు ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కోసం కన్నేశారు. వారిలో కర్ణాటకకు చెందిన యువ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ ఒకడిగా నిలిచాడు. ఈ విజయ్ హజారే టోర్నీలో దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తర్వాత, పడిక్కల్ కర్ణాటక జట్టులో చేరి క్వార్టర్ ఫైనల్, సెమీ-ఫైనల్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరుస్తూ కర్ణాటక జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించడంలో కీలక పాత్ర పోషించాడు.

బ్యాక్ టు బ్యాక్ 50+ స్కోర్‌లు..

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దేవదత్ పడిక్కల్ కర్ణాటక జట్టులో చేరాడు. ఈ క్రమంలో వడోదరతో జరిగిన కీలక మ్యాచ్‌లో రంగంలోకి దిగిన పడిక్కల్ 102 పరుగులతో మెరిశాడు.

సెమీఫైనల్ మ్యాచ్ లోనూ బ్యాటింగ్ ప్రారంభించిన పడిక్కల్ 86 పరుగులు చేశాడు. ఈ అద్భుత బ్యాటింగ్‌తో కర్ణాటక జట్టును ఫైనల్‌కు చేర్చడంలో యువ బ్యాట్స్‌మెన్ సక్సెస్ అయ్యాడు.

అవకాశం కోసం ఎదురుచూస్తున్న పడిక్కల్..

దేవదత్ పడిక్కల్ వన్డే ఫార్మాట్‌లో అదరగొట్టే బ్యాట్స్‌మెన్ అని చెబుతుంటారు. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఈ యువ బ్యాటర్ సాధించిన పరుగులే ఇందుకు నిదర్శనం.

2019లో లిస్ట్-ఎ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్ ఇప్పటివరకు 31 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలో అతను 9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశాడు. అంటే పడిక్కల్ 31 ఇన్నింగ్స్‌ల్లో 21 సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు.

అలాగే, 82.52 సగటుతో పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ ఇప్పటివరకు 2063 పరుగులు సాధించాడు. దేవదత్ పడిక్కల్ గత కొన్నేళ్లుగా ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలతో టీమిండియా తలుపులు తడుతున్నాడు. అయితే, గత 5 ఏళ్లుగా పడిక్కల్‌కు వన్డే జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యకరం.

దేశీ లీగ్‌లలో ఆధిపత్యం..

దేవదత్ పడిక్కల్ 2018లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలిసారి బ్యాటింగ్ చేశాడు. అప్పటి నుంచి అతను 41 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 4664 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 6 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు చేశాడు.

2019లో లిస్ట్-ఎ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పడిక్కల్ 32 మ్యాచ్‌ల్లో 31 ఇన్నింగ్స్‌లు ఆడి 91.20 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 2063 పరుగులు చేశాడు. అలాగే, అతను 2021 విజయ్ హజారే టోర్నమెంట్‌లో వరుసగా 4 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ భారత్ వన్డే జట్టులో అవకాశం కోసం చూస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..