విరాట్‌ కోహ్లీకి గుడ్‌న్యూస్‌..! సన్‌ రైజర్స్‌తో మ్యాచ్‌కి ఆ ఓపెనర్ రెడీ.. ఎవరో తెలుసా..?

Good news for Virat Kohli : ఐపీఎల్ 14 వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి తమ విజయాలను

విరాట్‌ కోహ్లీకి గుడ్‌న్యూస్‌..! సన్‌ రైజర్స్‌తో మ్యాచ్‌కి ఆ ఓపెనర్ రెడీ.. ఎవరో తెలుసా..?

Updated on: Apr 14, 2021 | 6:15 PM

Good news for Virat Kohli : ఐపీఎల్ 14 వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి తమ విజయాలను ప్రారంభించింది,. కానీ ఇప్పుడు వారు సన్ రైజర్స్ హైదరాబాద్ సవాలును ఎదుర్కోనున్నారు. విరాట్ కోహ్లీ జట్టు విజయాన్ని సాధించడంలో యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్, ఎబి డివిలియర్స్ ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా శుభవార్త తెలిసింది. వాస్తవానికి కరోనా వైరస్ బారిన పడిన తరువాత, అతని స్టార్ ఓపెనర్ దేవదత్ పాడికల్ ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా ఉన్నాడు. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే పాడికల్ ఇప్పుడు హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌ కోసం అందుబాటులో ఉన్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ చెన్నైలోని ఎంఎస్ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. బెంగళూరు జట్టు ముంబైని ఓడించడంతో, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన హైదరాబాద్ ఇప్పుడు ఆర్‌సీబీతో తలపడుతుంది. దేవదత్త పాడికల్ లేకపోవడంతో విరాట్ కోహ్లీతో కలిసి వాషింగ్టన్ సుందర్ ఓపెనింగ్‌ చేసేవాడు. పాడికల్స్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. ఐపీఎల్ చివరి సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున అత్యధికంగా 473 పరుగులు చేశాడు.

దేవదత్త పాడికల్ ఫిట్‌నెస్‌ గురించి జట్టు డైరెక్టర్ మైక్ హ్యూసన్ మాట్లాడుతూ.. “ఈ ఎడమచేతి వాటం ఆటగాడి పేరు హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కోసం పరిగణించబడుతుంది” అని అన్నారు. అదే సమయంలో ”దేవదత్త పాడికల్ మాట్లాడుతూ.. నేను ఈ సమయంలో పూర్తిగా ఫిట్ గా ఉన్నాను. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను మంచి రిఫ్లెక్స్‌లతో బ్యాటింగ్ చేయగలను. ఐపీఎల్‌లో ఇది చాలా ముఖ్యమైన విషయమని” చెప్పారు. ఈ సంవత్సరం విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్త ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. అతను 7 మ్యాచ్‌లలో వరుసగా 4 సెంచరీలు సాధించగా మరో మూడు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే ఫైనల్లో ముంబయిపై అతడి జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

Corona Tension: మహారాష్ట్ర కఠిన ఆంక్షలు..స్వస్థలాలకు వెళ్ళడానికి భారీగా రైల్వేస్టేషన్లకు చేరుకుంటున్న ప్రజలు!

CM KCR Live Video : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ ఫైనల్ టచ్..రేపటితో ముగియనున్న ప్రచారం.

AP Coronavirus roundup: ఏపీలో 4,157 కేసులు.. భారీగా పెరిగిన మరణాలు.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు అత్యవసర చికిత్స