IPL 2023: వరుస ఓటములపై స్పందించిన ఢిల్లీ టీమ్‌ యజమాని.. జట్టును ఇలా చూడడం నిరాశగా ఉందంటూ.

|

Apr 09, 2023 | 6:19 PM

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఈ జట్టు హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. జట్టు వరుసగా మూడు ఓటములు చెందడంతో జట్టు యజమాని పార్త్ జిందాల్ తన అసహనాన్ని వ్యక్తపరిచాడు. జట్టుపై బహిరంగంగానే విమర్శలు...

IPL 2023: వరుస ఓటములపై స్పందించిన ఢిల్లీ టీమ్‌ యజమాని.. జట్టును ఇలా చూడడం నిరాశగా ఉందంటూ.
Delhi Capitals
Follow us on

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఈ జట్టు హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. జట్టు వరుసగా మూడు ఓటములు చెందడంతో జట్టు యజమాని పార్త్ జిందాల్ తన అసహనాన్ని వ్యక్తపరిచాడు. జట్టుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఓటములతో ఢిల్లీ యజమాని కలత చెందినట్లు తెలుస్తోంది.

జట్టు ప్రదర్శనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు పార్త్‌ జిందాల్‌. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇలా జట్టును చూడడం చాలా నిరాశను కలిగించింది. గ్రౌండ్‌లో కొన్ని ప్రాంతాల్లో బ్యాటింగ్ తీరు నిరాశపరిచింది. అయితే మాకు మా జట్టుపై పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. మంగళవారం నుంచి రెట్టించిన ఉత్సాహంతో తిరిగి మ్యాచ్‌లో పాల్గొంటాం’ అని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ఢిల్లీ తన తొలి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్‌తో ఆడింది , అయితే ఈ మ్యాచ్‌లో జట్టు 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ వార్నర్ బ్యాట్‌తో 56 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీకి సొంత గ్రౌండ్‌లో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో వార్నర్ 37 పరుగులు చేశాడు. ఢిల్లీ బ్యాటర్స్‌లో ఒక్క వార్నర్‌ మాత్రమే రాణించాడు, మరెవ్వరూ అతనికి మద్దతుగా నిలవలేకపోయారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..