IPL 2023: వారిద్దరే ఢిల్లీని నిండా ముంచారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా దిగ్గజం..

|

May 23, 2023 | 6:51 PM

Delhi Capitals: ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. 2019 నుంచి గత సీజన్ వరకు ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే ఈ సంవత్సరం ఢిల్లీ ఆట చాలా ఘోరంగా తయారైంది. తొమ్మిదో స్థానంలో నిలవడం ద్వారా ఢిల్లీ IPL-2023ని ముగించింది.

IPL 2023: వారిద్దరే ఢిల్లీని నిండా ముంచారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా దిగ్గజం..
Delhi Capitals
Follow us on

ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. 2019 నుంచి గత సీజన్ వరకు ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే ఈ సంవత్సరం ఢిల్లీ ఆట చాలా ఘోరంగా తయారైంది. తొమ్మిదో స్థానంలో నిలవడం ద్వారా ఢిల్లీ IPL-2023ని ముగించింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఇద్దరు కెప్టెన్లతో నిండిన ఢిల్లీ జట్టుకు.. ఇలాంటి పరిస్థితి ఏర్పడడం దారుణంగా తాయారైంది. రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ ఈ జట్టులో కోచింగ్ స్టాఫ్‌లో ఉన్నప్పటికీ అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వీరిద్దరూ ఉన్న సమయంలో ఢిల్లీ జట్టు పురోగతి సాధించలేదని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

ఈ సీజన్‌లో ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగింది. రిషబ్ పంత్ గతేడాది కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ కారణంగా అతను ఈ సీజన్‌లో ఆడలేకపోయాడు. అతని స్థానంలో డేవిడ్ వార్నర్ జట్టుకు సారథ్యం వహించాడు. వార్నర్ బ్యాట్ పని చేసింది. కానీ, అతని కెప్టెన్సీ విఫలమైంది.

పాంటింగ్ హయాంలో మరింత దిగజారిన పరిస్థితి..

పాంటింగ్ హయాంలో ఢిల్లీ జట్టు పరిస్థితి ఘోరంగా తయారైందని భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన గవాస్కర్ అభిప్రాయపడ్డారుడు. యువ ఆటగాళ్లకు ఢిల్లీ పెద్దగా అవకాశాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్‌స్టార్‌లోని తన కాలమ్‌లో గవాస్కర్ రాసుకొచ్చారు. సులభంగా పరిష్కరించాల్సిన సమస్యలు జరగలేదు. భారతదేశంలోని వర్ధమాన తారలకు ఆంగ్లం అంతగా అర్థం కావడం లేదని, అందుకే యష్ ధుల్, ప్రియమ్ గార్గ్, సర్ఫరాజ్ ఖాన్ అంతకు మించి ముందుకు సాగలేకపోయారని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

పృథ్వీ షా సమస్యను కూడా ఇందులో ప్రస్తావించారు. పక్కటెముకలపై వచ్చే బంతులు ఆడేందుకు షా ఇబ్బంది పడేవాడని, అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని అన్నారు. ఫలితంగా పరుగులు తక్కువగా వచ్చాయని చెప్పుకొచ్చారు.

అక్షర్ పటేల్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు..

అదే సమయంలో ఢిల్లీ జట్టు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదని గవాస్కర్ కూడా అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో అక్షర్‌ను ఢిల్లీ ప్రమోట్ చేసి ఉండాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడితే, ఈ జట్టు 14 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఐదు మాత్రమే గెలిచింది. తొమ్మిదింటిలో ఓడిపోయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..