IND vs SL: వైడ్‌ ఇవ్వలేదని అంపైర్‌ను బూతులు తిట్టిన టీమిండియా క్రికెటర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

|

Jan 04, 2023 | 11:43 AM

టాప్‌స్కోరర్‌గా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన దీపక్‌ హుడాకే ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. కాగా ఈ మ్యాచ్‌లో చాలా అగ్రెసివ్‌ గా కనిపించాడీ యంగ్‌ క్రికెటర్‌. క్రీజులో ఉన్నంతసేపు సిక్సర్లతో ఫ్యాన్స్‌ను అలరించిన అతను ఒకానొక సందర్భంలో విచక్షణ కూడా కోల్పోయాడు.

IND vs SL: వైడ్‌ ఇవ్వలేదని అంపైర్‌ను బూతులు తిట్టిన టీమిండియా క్రికెటర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Deepak Hooda
Follow us on

ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. భారత్‌ విజయంలో యంగ్ సెన్సేషన్‌ దీపక్‌ హుడా కీలక పాత్ర పోషించాడు. 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌, 4 సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు అక్షర్ పటేల్ తో కలిసి అభేద్యమైన ఆరో వికెట్‌కు కేవలం 30 బంతుల్లో 61 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం కారణంగానే లంకేయుల ముందు టీమిండియా 163 పరుగుల గౌరవప్రదమైన టార్గెట్‌ను ఉంచింది. టాప్‌స్కోరర్‌గా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన దీపక్‌ హుడాకే ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. కాగా ఈ మ్యాచ్‌లో చాలా అగ్రెసివ్‌ గా కనిపించాడీ యంగ్‌ క్రికెటర్‌. క్రీజులో ఉన్నంతసేపు సిక్సర్లతో ఫ్యాన్స్‌ను అలరించిన అతను ఒకానొక సందర్భంలో విచక్షణ కూడా కోల్పోయాడు. వైడ్‌ ఇవ్వనందుకు అంపైర్‌తో గొడవకు దిగాడు. బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భారత ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కసున్ రజిత వేసిన ఆ ఓవర్‌ ఐదో బంతిని ఆఫ్‌ సైడ్‌ స్టాండ్‌ తీసుకుని ఆడేందుకు ప్రయత్నించాడు దీపక్‌. అయితే బంతి వైడ్‌లైన్‌ మీదుగా కీపర్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ కెఎన్ అనంతపద్మనాభన్ దీనిని వైడ్‌గా పరిగణించలేదు. దీంతో ఒక్కసారిగా దీపక్‌కు కోపం కట్టలు తెంచుకుంది. బ్యాట్‌తో క్రీజులైన్‌ను చూపిస్తూ అంపైర్‌ను ఎడాపెడా తిట్టాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారమే ఆ బంతిని వైడ్‌గా నిరాకరించానని అంపైర్‌ దీపక్‌ కు సర్దిచెప్పాడు. అయినా శాంతించని దీపక్‌ అంపైర్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. స్టంప్స్ మైక్‌లో ఇదంతా రికార్డయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌ లో తెగ చక్కర్లు కొడుతోంది. క్రికెట్‌ ఫ్యాన్స్‌ దీపక్‌ తీరుపై మండిపడుతున్నారు. ఆటను కాదు అంపైర్లను కూడా గౌరవించడం నేర్చుకో అంటూ హితవు పలుకుతూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..