DC vs SRH IPL 2021: అనుకన్నట్లుగానే ఆడారు.. ఢిల్లీ ముందు స్మాల్ టార్గెట్..

| Edited By: Narender Vaitla

Sep 22, 2021 | 9:58 PM

అనుకున్నట్లుగా ఆట కనిపించలేదు.. తక్కువ టార్గెట్‌ను ఢిల్లీ జట్టు ముందుంచారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక సన్‌రైజర్స్...

DC vs SRH IPL 2021: అనుకన్నట్లుగానే ఆడారు.. ఢిల్లీ ముందు స్మాల్ టార్గెట్..
Srh Rashid Khan
Follow us on

అనుకున్నట్లుగా ఆట కనిపించలేదు.. తక్కువ టార్గెట్‌ను ఢిల్లీ జట్టు ముందుంచారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ దూకుడుగా ఆడలేకపోయింది. ఐపీఎల్ 14వ సీజన్‌ మొదటి ఎడిషన్‌లో విఫలమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదే ఆటతీరును రెండో హాఫ్‌లోనూ కొనసాగించింది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 135 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఢిల్లీ ముందుంచింది.

ఆట మొదట్లో హైదరాబాద్‌ జట్టు భారీ దెబ్బ తగిలింది. ఆరంభంలోనే మూడో బంతికే డేవిడ్‌ వార్నర్‌ పరుగులు తీయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. ఎలాంటి పరుగులు చేయకుండానే నోర్జే వేసిన ఫస్ట్‌ ఓవర్‌లో మూడో బంతికే ఔటయ్యాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా (18) కాస్త దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు.. అయితే సాహా దూకుడుకు రబాడ బ్రేకులు వేశాడు.

రబాడ వేసిన బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18) కూడా పెద్దగా ఆడలేక పోయాడు. అతి తక్కువ సమయంలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. మనీశ్‌ పాండే (17), కేదార్‌ జాదవ్‌ (3), జాసన్‌ హోల్డర్‌ (10) రాణించలేదు. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ (28), రషీద్‌ ఖాన్ (22) రాణించడంతో హైదరాబాద్‌ ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో రబాడ 3, నోర్జే 2, అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి: Vizag Agency: విశాఖ జిల్లాలో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం.. పక్కా స్కెచ్ వేసి..!