RR vs GT Playing XI: టాస్ గెలిచిన రాజస్థాన్.. కీలక మార్పుతో బరిలోకి శాంసన్ సేన.. ఎవరొచ్చారంటే?

|

May 05, 2023 | 7:07 PM

Rajasthan Royals vs Gujarat Titans: ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలైంది.

RR vs GT Playing XI: టాస్ గెలిచిన రాజస్థాన్.. కీలక మార్పుతో బరిలోకి శాంసన్ సేన.. ఎవరొచ్చారంటే?
Rr Vs Gt Live Score
Follow us on

Rajasthan Royals vs Gujarat Titans: ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. జాసన్ హోల్డర్ స్థానంలో ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. అయితే గుజరాత్‌లో ఎలాంటి మార్పు లేదు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ 5 మ్యాచ్‌ల్లో విజయం, 4 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ 2 మాత్రమే గెలిచింది. గుజరాత్‌పై రాజస్థాన్ గెలిస్తే నంబర్ వన్ లేదా రెండో స్థానానికి రావొచ్చు. రాజస్థాన్‌కు చెందిన జోస్ బట్లర్, యశస్వి జైస్వాలి జోడీ అత్యంత ప్రభావవంతంగా కనిపిస్తోంది. ఇది జట్టుకు శుభారంభాన్ని అందిస్తుంది.

ఈ సీజన్‌లో ప్లేఆఫ్ అర్హత రేసులో గుజరాత్ టైటాన్స్ అత్యంత సమీపంలో ఉంది. గుజరాత్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే అర్హతకు చేరువవుతుంది. గుజరాత్ ప్లేఆఫ్ అర్హత 16 పాయింట్లతో నిర్ధారణ అవుతోంది. ఇప్పటివరకు గుజరాత్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 ఓడిపోయి 6 గెలిచింది. గుజరాత్‌లో అద్భుతమైన బౌలింగ్‌ అటాక్‌, మిడిల్‌ ఆర్డర్‌ ఉన్నాయి. బౌలింగ్‌లో పేస్‌లో మహ్మద్ షమీ, స్పిన్‌లో రషీద్ ఖాన్ ఉన్నారు. అదే సమయంలో మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్ విధ్వంసం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇరుజట్లు:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..