David Warner’s wife: వ్యంగ్యంగా ట్వీట్ చేసిన డేవిడ్ వార్నర్ భార్య.. ఎవరిని ఉద్దేశించి చేసిందంటే..!

|

Nov 15, 2021 | 11:26 AM

ఐపీఎల్-2021లో పేలవ ప్రదర్శన చేసిన డేవిడ్ వార్నర్ టీ20 వరల్డ్ కప్ 2021లో సత్తా చాటారు. ఈ టోర్నమెంట్‎లో మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. దీనిపై అతడి భార్య కాండిస్ వార్నర్ ట్వీట్‌ చేశారు...

David Warner’s wife: వ్యంగ్యంగా ట్వీట్ చేసిన డేవిడ్ వార్నర్ భార్య.. ఎవరిని ఉద్దేశించి చేసిందంటే..!
Warner
Follow us on

ఐపీఎల్-2021లో పేలవ ప్రదర్శన చేసిన డేవిడ్ వార్నర్ టీ20 వరల్డ్ కప్ 2021లో సత్తా చాటారు. ఈ టోర్నమెంట్‎లో మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. దీనిపై అతడి భార్య కాండిస్ వార్నర్ ట్వీట్‌ చేశారు. ఐపీఎల్ 2021లో ‘యువకులకు అవకాశం ఇవ్వడం’ కోసం వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలగించింది. అయితే విమర్శలకులు 35 ఏళ్ల 35 ఏళ్ల వార్నర్‎ను టార్గెట్ చేస్తూ ‘లాస్ట్ టచ్’, ‘ఎండ్ ఆఫ్ వార్నర్’, ‘టూ ఓల్డ్’ జిబ్స్‌తో పోస్టులు పెట్టారు. ఐపీఎల్ 2021లో అతను మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారు. అతను జట్టు హోటల్‌ను కూడా వదిలేశాడు.

కానీ వార్నర్ న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో 38 బంతుల్లో 53 పరుగులతో విమర్శకుల నోరు మూయించాడు. ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీని గెలుచుకున్నాడు. వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకుని SRH తప్పుడు నిర్ణయం తీసుకుందని నిరూపించాడు. డేవిడ్ వార్నర్ IPL 2021లో 8 మ్యాచ్‌లలో 24.37 సగటు, 107.73 స్ట్రైక్ రేట్‌తో 195 పరుగులు చేశాడు. అయినా ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అతను ఆరోన్ ఫించ్‌కు సరైన ఓపెనింగ్ భాగస్వామి కాకపోవచ్చునని క్రీడా నిపుణులు భావించారు. కానీ ఆస్ట్రేలియన్ కెప్టెన్ తన సహచరుడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. అతని ఫామ్‌తో సంబంధం లేకుండా తన ఓపెనింగ్ భాగస్వామికి అండగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో వార్నర్ ఆరంభం బాగాలేదు. వార్మప్ మ్యాచ్‌లలో సరిగా ఆడలేదు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‎లో 14 పరుగులే చేశాడు. కానీ తర్వాతి మ్యాచ్ నుంచి గేర్ మార్చాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 65, 1, 18, 89*, 49, 53 పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్ కప్‎లో వార్నర్ 48.16 సగటుతో 289 పరుగులు చేశాడు. అతను
ఫైనల్ మ్యాచ్‎లో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. “ఒక జట్టు మద్దతు చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. వార్నర్‌కు అతని కెప్టెన్, కోచ్ లాంగర్ మద్దతు ఇచ్చారు.” అని షేన్ వాట్సన్ వ్యాఖ్యానం సందర్భంగా చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్‎ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు
డేవిడ్ వార్నర్-289(2021)
మాథ్యూ హెడెన్-265(2007)
షేన్ వాట్సన్-249(2012)

Read Also.. T20 World Cup 2021: షూస్‌లో బీర్లు తాగుతూ.. షాంపెయిన్‌ బాటిల్స్‌ పొంగిస్తూ.. ఆసీస్‌ క్రికెటర్ల సంబరాలు మాములుగా లేవుగా..