నేను మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తాను.. ఫ్యాన్స్‌కు తెలుగులో ట్వీట్ చేసిన డేవిడ్ వార్నర్

|

May 29, 2021 | 1:56 PM

David Warner Surprises: నేను మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తాను అభిమానులారా. మీకు నా మీద ఉండే ప్రేమకి, ఇంకా మీ సహకారానికి ధన్యవాదాలు'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తెలుగు అభిమానులు.. వార్నర్‌ తెలుగుకు సంతోషం...

నేను మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తాను.. ఫ్యాన్స్‌కు తెలుగులో ట్వీట్ చేసిన డేవిడ్ వార్నర్
David Warner Surprises Fans
Follow us on

ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగువారి మనసు దోచుకున్నాడు. నిన్న తన సతీమణి క్యాండిస్‌కు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’అంటూ తెలుగులో ప్రపోజ్ చేసిన డేవిడ్ భాయ్.. నేడు తన తెలుగుతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. స్పష్టమైన తెలుగు మాటలతో సోషల్ మీడియాను కుమ్మేస్తున్నాడు. తాజాగా అభిమానులారా…! అంటూ ఎన్టీఆర్‌ పలకరించినట్లుగా… అచ్చం తెలుగులో మురిపించాడు.

“నేను మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తాను అభిమానులారా. మీకు నా మీద ఉండే ప్రేమకి, ఇంకా మీ సహకారానికి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట సందడి చేస్తోంది. తెలుగు అభిమానులు.. వార్నర్‌ తెలుగును చూసి ముచ్చట పడిపోతున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న డేవిడ్ వార్నర్.. గత ఏడాది నుంచి తెలుగు సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్నాడు. పాటలకే కాదు.. బాహుబాలి లాంటి సినిమా డైలాగ్‌‌లతో టిక్‌టాక్‌లో అందర్నీ కట్టడిపడేశాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నప్పటికీ.. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు. జట్టు వరుస ఓటములకు డేవిడ్ వార్నర్‌ను బాధ్యుడ్ని చేస్తూ అతని కెప్టెన్సీ నుంచే కాకుండా తుది జట్టు నుంచి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ పంపించింది.

ఐపీఎల్‌లో ఘనమైన రికార్డులున్న వార్నర్‌ని తుది జట్టు నుంచి తప్పించడంపై హైదరాబాద్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది మాజీ క్రికెటర్లు ఇది అతన్ని అవమానించడమేనంటూ.. హైదరాబాద్ తరఫున వార్నర్‌కి ఇది ఆఖరి సీజన్‌గా అభివర్ణించారు.

 MS Dhoni Pampers Horse: గుర్రానికి మసాజ్ చేస్తున్న ఎం ఎస్ ధోనీ..వైరల్‌గా మారిన వీడియో

‘కింగ్’ కోహ్లీకి బాలీవుడ్‌తో ప్రత్యేక సంబంధం.. ఆ ఐదుగురు నటులతో మాత్రమే..

RBI Announces: కొత్తగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదు… తేల్చి చెప్పిన ఆర్‌బీఐ