Cricket: 5 ఫోర్లు, 3 సిక్సర్లు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్లపై వీరవిహారం.. సీన్ కట్ చేస్తే!

|

Aug 16, 2022 | 4:29 PM

హండ్రెడ్‌ లీగ్‌ 2022లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ రెచ్చిపోతున్నారు. తమలోని ప్రతిభను వెలికితీస్తూ..

Cricket: 5 ఫోర్లు, 3 సిక్సర్లు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్లపై వీరవిహారం.. సీన్ కట్ చేస్తే!
Daniel Sams
Follow us on

హండ్రెడ్‌ లీగ్‌ 2022లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ రెచ్చిపోతున్నారు. తమలోని ప్రతిభను వెలికితీస్తూ.. ప్రత్యర్ధులను బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ టీమ్‌మేట్ డానియల్ సామ్స్.. బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. కాని అతడి జట్టు మాత్రం విజయం దక్కించుకోలేకపోయింది. ఫలితంగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్.. నిర్ణీత 100 బంతులకు 6 వికెట్లు నష్టపోయి 145 పరుగులు చేసింది. డేనియల్‌ సామ్స్‌ (25 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రెగరీ (22 బంతుల్లో 35 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. బర్మింగ్‌హామ్‌ బౌలర్‌ హోవెల్‌ 3 వికెట్లు పడగొట్టి.. ట్రెంట్ రాకెట్స్ పతనంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక లక్ష్యచేదనలో భాగంగా బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్‌ జట్టు మరో 14 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేధించింది. ఆ జట్టు కెప్టెన్ మొయిన్ అలీ(52), లివింగ్‌స్టన్(51) మెరుపు అర్ధ శతకాలు చేయడంతో బర్మింగ్‌హామ్ జట్టు లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. ట్రెంట్ రాకెట్స్ బౌలర్ లూక్ వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ విజయంతో బర్మింగ్‌హామ్ జట్టు 3 వరుస విజయాలతో మూడో స్థానానికి ఎగబాకగా.. ట్రెంట్ రాకెట్స్.. ఈ సీజన్‌లో తొలి ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయింది.