ఐపీఎల్ 2022(IPL 2022) లో ప్రస్తుత విజేత చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) నుంచి ఆశించిన ప్రదర్శన ఇంకా కనిపించలేదు. సీజన్ ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని వదులుకుని రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేశాడు. జడేజా కెప్టెన్సీ కెరీర్ సరిగ్గా ప్రారంభం కాలేదు. అతని కెప్టెన్సీలో ఇప్పటి వరకు చెన్నై మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడగా, మూడింటిలోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ జట్టు శనివారం డబుల్ హెడర్ రోజున రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో తలపడనుంది. సన్‌రైజర్స్ కూడా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా, రెండింటిలోనూ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు కచ్చితంగా విజయాన్ని సాధించగలదు.
ఈ సీజన్‌లో చెన్నైకి చాలా ప్రతికూలతలు ఎదురయ్యాయి. ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలర్లు కూడా చెన్నై టీంకు విజయాన్ని అందించలేకపోయారు. ఇప్పటివరకు ఒకే ఒక్క సానుకూలాంశం కనిపించింది. అది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫామ్. ధోని నిలకడగా వేగంగా పరుగులు చేస్తున్నాడు.
చెన్నై విజయం సాధించేనా?
తొలి విజయం కోసం చెన్నై ఎదురుచూస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై జట్టులో చాలా మార్పులు చేసే అవకాశం చాలా తక్కువ. చెన్నై జట్టులో ఒక మార్పు ఆశించవచ్చు. అది కూడా బౌలింగ్‌లో మార్పు చూడొచ్చు. గత రెండు మ్యాచ్‌ల నుంచి ముఖేష్ చౌదరికి ఆడే అవకాశం లభించినా.. అతను ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అతని స్థానంలో ఇటీవలే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన రాజ్‌వర్ధన్ హెంగెర్‌గేకర్‌కు చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వవచ్చు. లేదా ఆ స్థానంలో కేఎం ఆసిఫ్ లేదా తుషార్ దేశ్ పాండేలకు కూడా అవకాశం ఇవ్వవచ్చు.
హైదరాబాద్ ఓటమి బాట నుంచి బయటపడేనా?
ఈ సీజన్‌లో హైదరాబాద్‌కి సరైన కాంబినేషన్ రావడం కష్టంగా కనిపిస్తోంది. కేన్ విలియమ్సన్‌తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నాడు. విలియమ్సన్ నంబర్-3లో బాగా బ్యాటింగ్ చేస్తే, రాహుల్ త్రిపాఠి ఓపెనర్‌గా మారవచ్చు. అబ్దుల్ సమద్ స్థానంలో ప్రియమ్ గార్గ్ మిడిల్ ఆర్డర్‌లో ఆడగలడు.
రెండు జట్ల XI ప్లేయింగ్ ఇలా ఉండొచ్చు..
చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోని (కీపర్), డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్, రాజ్‌వర్ధన్ హెంగెర్గేకర్/తుషార్ దేశ్‌పాండే,
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, ప్రియమ్ గార్గ్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్.
CSK vs SRH IPL 2022 Match Prediction: చెన్నైతో హైదరాబాద్ ఢీ.. బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?