Chennai Super Kings vs Punjab Kings: ఎంతో కీలకంగా మారిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుత విజయాన్ని సాధించింది. చెన్నై నిర్ధేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా చేధించింది. కేవలం 13 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది. ప్లే ఆఫ్‌లో స్థానం దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత ఆటతీరుతో జట్టుకు విజయాన్ని సొంతం చేశాడు. మొదటి నుంచి భారీ షాట్‌లతో రాణిస్తూ టీమ్ స్కోరును పరుగులు పెట్టించాడు. భారీ సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు.
ఈ క్రమంలో పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక రాహుల్ కేవలం 55 బంతుల్లో 76 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చాన్స్ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి పంపిస్తూ జట్టు స్కోరు ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఇదిలా ఉంటే స్కోర్ బోర్డును చూస్తే.. రాహుల్ జట్టు గెలుపు బాధ్యతను ఒక్కడే తీసుకున్నట్లు కనిపించింది. రాహుల్ తప్ప మిగతా ఏ బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగులు సాధించకపోవడం గమనార్హం. ఈ గెలుపుతో పంజాబ్‌కు ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి.
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు తొలి నుంచి తడబడింది. పంజాబ్ బౌలర్ట దాటికి చెన్నై బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయిన చెన్నై 134 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లో డు ప్లెసిస్ ఒక్కడే గౌరవప్రదమైన పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 55 బంతుల్లో 76 పరుగులు సాధించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు.
Also Read: Niharika Konidela : ఆంధ్రా కాశ్మీరం అద్భుతం.. ఇన్నాళ్ళూ మిస్సయ్యానంటున్న మెగా డాటర్ నిహారిక