Chennai Super Kings vs Mumbai Indians Highlights: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 98 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. తిలక్ వర్మ 34, రోహిత్ శర్మ 18, హృతిక్ షోకీన్ 18పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరీ 3, సిమర్‌జీత్ సింగ్ 1, మొయిన్ అలీ 1 వికెట్ సాధించారు. ఈ విజయంతో ముంబయికి పెద్దగా ప్రయోజనం లేదు. అలాగే ఓడిపోయిన చెన్నై కూడా ఇంటిముఖం పట్టక తప్పదు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ముంబై బౌలర్ల దాటికి 97 పరుగులకే చాప చుట్టేసింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులేత్తేసింది. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లోకి జారుకుంది. చెన్నై జట్టులో డేవన్ కాన్వే, మొయిన్ అలీ, తీక్షణ సున్న పరుగులకే వెనుదిరిగారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 7, రాబిన్ ఉతప్ప 1, అంబటి రాయుడు 10, శివమ్ దూబే 10, డ్వేన్ బ్రావో 12, ముకేశ్ చౌదరి 4 పరుగులకే పరిమితయ్యారు. ఇక చెన్నై బ్యాటర్లలో ధోనీ చేసిన (36*) పరుగులే అత్యధికం కావడం గమనార్హం.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దుబే, ఎమ్‌ఎస్ ధోని, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముకేశ్ చౌదరీ.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, రమణ్‌దీప్ సింగ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్
ఈ మ్యాచ్‌లో ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ ఓడితే ముంబై ఇండియన్స్ తర్వాత అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రెండో జట్టుగా చెన్నై నిలవనుంది.
ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న ముంబై, మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే 10 పాయింట్లతో బెటర్ పొజిషన్‌లో ముగించేందుకు అవకాశాలు ఉంటాయి.
చెన్నైపై 5 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 14.5 ఓవర్లలో 103 పరుగులు చేసింది. తిలక్ వర్మ 34, రోహిత్ శర్మ 18, హృతిక్ షోకీన్ 18పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరీ 3, సిమర్‌జీత్ సింగ్ 1, మొయిన్ అలీ 1 వికెట్ సాధించారు.
ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. హృతిక్ షోకీన్ 18 పరుగులకి ఔటయ్యాడు. దీంతో ముంబై 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. విజయానికి ఇంకా44 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉంది.
ముంబై 10 ఓవర్లకి 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. క్రీజులో హృతిక్ షోకీన్ 17 పరుగులు, తిలక్ వర్మ 17 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 58 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరీ 3, సిమర్‌జీత్ సింగ్ 1 వికెట్ సాధించారు.
ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ ఎల్‌బీడబ్ల్యూ రూపంతో అవుట్ అయ్యాడు.
ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చిన ఇషాన్ కిషాన్ పెవలియన్ బాట పట్టాడు. దీంతో ముందై 6 పరుగులకే వికెట్ కోల్పోయింది.
కీలకమైన మ్యాచ్‌లో చెన్నై తడబడింది. ముంబై బౌలర్లు విజృంభించడంతో చెన్నై బ్యాటింగ్ లైనప్ పేక మేడల కూలిపోయింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టాడు. కేవలం 16 ఓవర్లు మాత్రమే ఆడిన చెన్నై 97 పరుగులు చేసి అలవుట్ అయ్యింది. దీంతో ముంబై ముందు కేవలం 98 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
చెన్నై సూపర్ కింగ్స్ మరో వికెట్ కోల్పోయింది. రమణ్ దీప్ సింగ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చినా మహేశ్ తీక్షణ డకవుట్ అయ్యాడు. దీంతో చెన్నై 80 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.
ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి చెన్నై సూపర్ కింగ్స్ బాటింట్ లైనప్ కుప్పకూలింది. కేవలం 80 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. దీంతో చెన్నై స్కోర్ 100 పరుగులైనా దాటుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కూలిపోతోంది. తాజాగా శివమ్ దూబే పెవిలియన్ బాట పట్టాడు. మెరెడిత్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చిన శివమ్ దూబే అవుట్ అయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మరో వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మెరెడిత్ బౌలింగ్‌లో ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. డేనియల్ సామ్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి చెన్నై బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పడుతున్నారు. బుమ్రా బౌలింగ్‌లో ఉతప్ప వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి కూరుకుపోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ల పతనం కొనసాగుతోంది. రెండో పరుగుకే రెండో వికెట్ కోల్పోయింది. డేనియల్ సామ్స్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్‌కు క్యాచ్ ఇచ్చిన మొయిన్ అలీ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో చెన్నై రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
రెండో బంతికే చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయింది. డేనియల్ సామ్స్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే ఎల్‌బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఒక పరుగుకే వికెల్ కోల్పోయింది.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దుబే, ఎమ్‌ఎస్ ధోని, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముకేశ్ చౌదరీ.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, రమణ్‌దీప్ సింగ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. డ్యూ కారణంగా పిచ్ చేజింగ్‌కు అనుకూలిస్తుండడంతో రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడు.