మరో కొద్ది గంటల్లో క్రికెట్ పండగ ప్రారంభం కాబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడబోతున్నాయి. ఇప్పటికే రెండు టీంలు నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాయి. టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే.. ఈ డిఫెండింగ్ ఛాంపియన్స్ జట్టులో పలువురు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు కోలుకున్నప్పటికీ.. తిరిగి పూర్తిగా ఫామ్‌లోకి వచ్చారా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. అటు వీసా జాప్యత కారణంగా ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. గాయం కారణంగా పేస్ బౌలర్ దీపక్ చాహార్ మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నారు. అలాగే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని జడేజాకు సారధ్య బాధ్యతలు ఇవ్వడంతో.. ఈ ఆల్‌రౌండర్ జట్టును ఎలా ముందుకు తీసుకెళతాడో.? వేచి చూడాలి.!
అటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమ్మిన్స్.. ఇంటర్నేషనల్ డ్యూటీస్ కారణంగా మొదటి ఐదు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. అయితేనేం.. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో కేకేఆర్ జట్టు మాత్రం ఎలాగైనా మొదటి మ్యాచ్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
మరోవైపు ధోని ఫస్ట్ మ్యాచ్‌కు ఎలాంటి కొత్త మార్పులు చేయకుండా.. సీనియర్ ప్లేయర్స్‌కే పూర్తి బాధ్యతను ఇచ్చేలా కనిపిస్తున్నాడు. తనదైన శైలి కెప్టెన్సీతో గెలుపుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాడు. మరి మొదటి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్(అంచనా): కాన్‌వే, రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎం ఎస్ ధోని, రవీంద్ర జడేజా(కెప్టెన్), డ్వేన్ బ్రేవో, ఆడమ్ మిలని, జోర్డాన్/శాంట్నర్ , ఆసిఫ్/సోలంకి
కోల్‌కతా నైట్ రైడర్స్(అంచనా): సామ్ బిల్లింగ్స్, అజింక్యా రహనే, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టీం సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్