Chennai Super Kings vs Gujarat Titans, Final Reserve day: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు రిజర్వ్ డే రోజున చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ చరిత్రలో రిజర్వ్ డే రోజున ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. ఆదివారం అహ్మదాబాద్‌లో వర్షం కురవడంతో మ్యాచ్ జరగలేదు. ఈ కారణంగా ఈరోజు నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..