MS Dhoni: ఐపీఎల్ 2021 యూఏఈలో జోరుగా నడుస్తోంది. లీగ్‌లో ఆధిపత్యం చెలాయించడానికి ప్లే ఆఫ్‌లో చేరేందుకు పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పటికే ధోని సారథ్యంలోని సీఎస్‌కే టీం దాదాపు ప్లేఆఫ్‌లో చేరినట్లు. అయితే ఈ క్రిడిట్ అంతా మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనికే చెందుతుంది. టీంను ముందుడి నడిపించడంలో ఆదితేరిన దిట్ట. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని అత్యంత విలువైన ఆటగాడని ఆస్ట్రేలియా, సీఎస్‌కే మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ తెలిపారు. యూఏఈలో సీఎస్‌కే టీం ఇప్పటివరకు ఓడిపోలేదు. ఇందుకు కారణం ధోని మైదానంల చూపించే పదునైన కెప్టెన్సీ వ్యూహాల ఫలితమే అంటూ పేర్కొన్నాడు.
ధోని ఏజ్ పెరుగుతుందని, అతని బ్యాట్ నుంచి అత్యుత్తమమైన ఆటను మునుపటిలాగా చూడలేమని హేడెన్ తెలిపాడు. అయితే ధోని మైదానంలో ధోని వ్యూహాలు ఇప్పటికీ ఎంతో పదునుగా ఉంటాయని అన్నాడు. అలాగే ఆటగాళ్ల నుంచి ఉత్తమ ఆటను ఎలా తీసుకరావాలో ధోనికి బాగా తెలుసని ఆయన తెలిపాడు.
“ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఆటగాడు ధోనినే. బ్యాట్‌తో మెరుపులు తక్కువైనా.. కెప్టెన్‌గా మాత్రం మంచి ఫలితాలు రాబడుతున్నాడు. ధోనికి ఏజ్ పెరుగుతుంది. అతని బ్యాట్ మునుపటిలాగా మెరుపులు కురిపించకపోవచ్చు. కానీ, టీంను అత్యుత్తమంగా నిలబెట్టడంలో మాత్రం ఆయన తరువాతే ఎవరైనా’ అని తెలిపాడు.
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ భుజాన వేసుకున్నాడు. పాతతరం ఆటగాళ్ల నుంచి కూడా అత్యుత్తమ ఆటను రాబడుతున్నాడు. డీజే బ్రావో, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి ప్లేయర్లే ఇదుకు చక్కని ఉదాహరణ. సీఎస్‌కే స్క్వాడ్‌లో ధోనీతో సన్నిహితంగా పని చేస్తున్నట్లు మాజీ ఆస్ట్రేలియన్ పేర్కొన్నాడు. జట్టు ఎంపికలోనూ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు.
సీఎస్‌కే ప్రస్తుతం 16 పాయింట్లలో లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. సీఎస్‌కే తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 30 న షార్జా క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరుగుతుంది.