Video: 6,6,6,6,6,6,6.. 10 సిక్స్‌లు, 12 ఫోర్లు.. 31 బంతుల్లో ఊచకోత.. సెంచరీతో చెలరేగిన చెన్నై రిటైన్ ప్లేయర్..

Urvil Patel 31 Ball Century: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసిన ఓ పవర్ ఫుల్ బ్యాట్స్‌మన్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాటింగ్‌తో ప్రేక్షకులనే కాదు ధోనిని కూడా ఆకట్టుకున్నాడు.

Video: 6,6,6,6,6,6,6.. 10 సిక్స్‌లు, 12 ఫోర్లు.. 31 బంతుల్లో ఊచకోత.. సెంచరీతో చెలరేగిన చెన్నై రిటైన్ ప్లేయర్..
Urvil Patel Century

Updated on: Nov 26, 2025 | 6:52 PM

31-ball Century India Cricket: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రిటైన్ చేసుకున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో బ్యాట్‌తో బీభత్సం సృష్టించాడు. గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఉర్విల్.. సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 31 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ సి మ్యాచ్‌లో గుజరాత్, సర్వీసెస్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

IND vs SA: ఏరికోరి టీమిండియా కోచ్‌గా వచ్చింది ఇందుకేనా గంభీర్.. తొక్కలో స్ట్రాటజీతో కొంపముంచావ్‌గా..

ఇవి కూడా చదవండి

ఉర్విల్ పటేల్ ఇన్నింగ్స్..

ఉర్విల్ కేవలం 31 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా 37 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా గుజరాత్ జట్టు 12.3 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇదికూడా చదవండి: గంభీర్, అగార్కర్‌ల మూర్ఖత్వానికి నలుగురు బలి.. టీమిండియా నుంచి ఇలా గెంటేశారేంటి..?

ధోనీ గర్వపడే ప్రదర్శన..

ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఉర్విల్ పటేల్ ప్రదర్శన చూసి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా గర్వపడతాడు. గత ఐపీఎల్ సీజన్‌లో ఉర్విల్ మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కానీ గాయపడిన వంశ్ బేడీ స్థానంలో జట్టులోకి వచ్చిన అతను, కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే తన సత్తా చాటాడు. 212.50 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఉర్విల్‌ను సీఎస్‌కే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను ప్రదర్శించిన ఆటతీరు రాబోయే ఐపీఎల్ సీజన్‌పై భారీ అంచనాలను పెంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..