CSK Agreed Moeen Ali Request : ఐపీఎల్‌లో మూడుసార్లు విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. అయితే జట్టు జెర్సీ ధరించే ముందు మొయిన్ అలీ సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ముందు ఓ కండీషన్ పెట్టాడు. అయితే అతడి కండీషన్ ను జట్టు యాజమాన్యం అంగీకరించింది. జెర్సీలోని ఆల్కహాల్ బ్రాండ్ లోగోను తొలగించాలని మొయిన్ అలీ సీఎస్‌కే టీమ్ మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు. ఫ్రాంఛైజీ దీనిని అంగీకరించింది. మొయిన్ అలీ జెర్సీలోని ఆల్కహాల్ బ్రాండ్ లోగోను తొలగించింది.
మొయిన్ ముస్లిం, అతని మతం అతన్ని మద్యం తాగడానికి లేదా ప్రోత్సహించడానికి అనుమతించదు. అతను ఇంగ్లాండ్‌తో ఆడుతున్నప్పుడు కూడా ఎలాంటి ఆల్కహాల్ బ్రాండ్‌ను ప్రోత్సహించడు. అతను, ఆదిల్ రషీద్ ఇద్దరూ మద్యపాన సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. CSK జెర్సీపై ఆల్కహాల్ బ్రాండ్ అయిన SNJ 10000 లోగోను కలిగి ఉంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. జెర్సీలోని లోగోను తొలగించమని మొయిన్ జట్టు యాజమాన్యాన్ని కోరాడు. ఇది సీఎస్‌కే అంగీకరించి అతని మ్యాచ్ జెర్సీలోని లోగోను తీసివేసింది.
ఐపీఎల్ -2021 వేలంలో మూడుసార్లు విజేత అయిన సీఎస్‌కే మొయిన్ అలీపై భారీగా డబ్బులు కురిపించింది. ఏడు కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ ఆల్ రౌండర్ జట్టు కోసం పని చేస్తాడని యాజమాన్యం భావిస్తోంది. మొయిన్ అలీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి సీఎస్‌కేకు వచ్చారు. ధోని కెప్టెన్సీలో ఆడటానికి ఉత్సాహంగా ఉన్నానని ఆయన ఇటీవల చెప్పారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో సీఎస్‌కే ఒక్కటి. ఈ జట్టు మూడుసార్లు ఐపీఎల్ గెలిచింది. గత సీజన్ అయితే దారుణం.. జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేదు.. లీగ్ చరిత్రలో మొదటిసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. అయితే ఈసారి నాలుగో ఐపీఎల్ టైటిల్‌ను గెలవడానికి జట్టు ప్రయత్నిస్తుంది..