Kerala Stray Dogs: ఇటీవల కేరళ రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. ఒంటరిగా వెళుతోన్న వారిపై ఇవి నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నాయి. పిచ్చిపట్టినట్లు పెద్దలు, పిల్లలపై దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుక్కలను సంహరించే విషయమై అక్కడి ప్రభుత్వం హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడనప్పటికీ కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కుక్కలను సంహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు గుంపులుగా మారి కుక్కలకు సామూహికంగా చంపేస్తున్నారని సమాచారం. వీటికి సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతున్నాయి. నేషనల్ మీడియాలోనూ వీటికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కేరళలో కుక్కల సామూహిక సంహారంపై స్పందించాడు.
‘ఇది చాలా భయంకరంగా ఉంది. కేరళలో కుక్కలను దారుణంగా చంపుతున్నారు. ఇలాంటి చర్యలపై పునరాలోచించుకోవాలి. ఈ క్రూరమైన హత్యలకు స్వస్తి పలకాలి’ అని ట్వీట్ చేశాడు శిఖర్. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహజంగానే జంతు ప్రేమికుడైన శిఖర్ కుక్కలను భారీ సంఖ్యలో సంహరిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ విధంగా స్పందించాడు. అయితే ధావన్ ట్వీట్‌కు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. కుక్కలు పిల్లలపై దాడి చేస్తున్న ఫొటోలు, వీడియోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అవి ఇలా దాడిచేస్తున్నాయి. ఆత్మరక్షణకే కుక్కలను చంపుతున్నట్లు చెబుతున్నారు.
This is so horrifying that mass killing of dogs in #kerala is taking place. I would request to reconsider such moves and put an end to these brutal killings.
— Shikhar Dhawan (@SDhawan25) September 16, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..