World Cup 2023 Stadiums Upgrade BCCI: ప్రపంచ కప్ 2023 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. టోర్నీలో తొలి మ్యాచ్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో జరగనుంది. ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్టేడియాలను మరింతగా తీర్చిదిద్దే పనిని ప్రారంభించింది. ఈమేరకు ఏడు స్టేడియాల్లో అభివృద్ధి పనులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఈ ఏడు స్టేడియాలకు ఒక్కోదానికి రూ.50 కోట్లు చొప్పున కేటాయించిందని వార్తలు వినినిస్తున్నాయి. ఈ జాబితాలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ నుంచి లక్నోలోని అటల్ విహారీ బాజ్‌పేయి స్టేడియం వరకు ఉన్నాయి.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో బీసీసీఐ కొత్త ఫ్లడ్‌లైట్లను అమర్చనుంది. ఈ స్టేడియంలో కార్పోర్ట్ బాక్సులను కూడా అమర్చనున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ అప్‌గ్రేడ్ చేయనుంది. ధర్మశాలలో కొత్త అవుట్‌ఫీల్డ్ సిద్ధమవుతోంది. పూణే స్టేడియంలో రూఫింగ్ పనులు జరగనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం(ఢిల్లీ)లో మరుగుదొడ్లు, సీట్లకు మరమ్మతులు చేస్తారు. వీటితోపాటు టిక్కెట్ సిస్టమ్‌ను సరికొత్తగా అప్‌గ్రేడ్ చేస్తారు. లక్నోలోని స్టేడియంలో పిచ్ వర్క్ జరుగుతోంది. చెన్నైలో పిచ్ వర్క్ జరగనుంది. దానితో ఎల్‌ఈడీ లైట్లు అమర్చనున్నారు.
ముఖ్యంగా భారతరత్న శ్రీ అటల్ విహారీ బాజ్‌పేయి స్టేడియం(లక్నో)పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ స్పెషల్‌గా ఫోకస్ చేయనుందంట. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన సమయంలో లో స్కోరింగ్ మ్యాచ్‌లుగా నిలిచాయి. దీంతో ఈ పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఫోకస్ పెంచారంట. స్టేడియంలో మొత్తం 11 పిచ్‌లను రెడీ చేసి, కొత్త గడ్డిని కూడా నాటారు. అక్టోబర్ 29న ఈ మైదానంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. మొత్తంగా 2023 ప్రపంచకప్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు ఈ స్టేడింయలో జరగనున్నాయి. భారత్ vs ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్ 2 జట్ల మధ్య మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..