టాంటాన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్.. బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. ఓపెనర్ హోప్(96: 121 బంతుల్లో 4 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణేత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అటు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయిస్(70: 67 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), హెట్‌మైర్(50: 26 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) కూడా అద్భుతంగా రాణించారు. ఇకపోతే బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, ముస్తిఫిజుర్ మూడు వికెట్లు పడగొట్టగా.. షకిబుల్ హాసన్ రెండు వికెట్లు తీశాడు.