Viral Video: డ్వేన్ బ్రావోపై లై‌వ్‌లో దాడి చేయబోయాడు.. అనంతరం ఏం జరిగిందంటే?

ఆగష్టు 29 న జరిగిన సీపీఎల్ సీజన్ 8 వ మ్యాచ్‌లో, పేట్రియాట్స్ వర్సెస్ గయానా వారియర్స్ జట్లు మైదానంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావోపై దాడితో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

Viral Video: డ్వేన్ బ్రావోపై లై‌వ్‌లో దాడి చేయబోయాడు.. అనంతరం ఏం జరిగిందంటే?
Cpl2021

Updated on: Aug 30, 2021 | 7:11 PM

ఐపీఎల్ 2021 కు రంగం సిద్ధమైంది. కానీ, అంతకు ముందు, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వెస్టిండీస్ గడ్డపై జరుగుతోంది. దీంట్లో 6 జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రతి జట్టు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బ్యాట్స్‌మెన్లు పరుగులు సాధించేందుకు పోటీపడుతుండగా, బౌలర్లు వికెట్ల తీసేందుకు తీవ్రంగా పోటీపడుతున్నారు. అయితే, ఆగష్టు 29న ఆడిన సీజన్ 8 వ మ్యాచ్‌లో, పేట్రియాట్స్ వర్సెస్ గయానా వారియర్స్ జట్లు మైదానంలో ముఖాముఖిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావోపై హెట్‌మెయర్ దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడం లైవ్‌లో కనిపించింది. దీంతో ప్రేక్షకులతోపాటు నెటిజన్లు కూడా షాక్‌కు గురయ్యారు.

ఈ సంఘటన గయానా వారియర్స్ బ్యాటింగ్ సమయంలో జరిగింది. గయానా ఇన్నింగ్స్‌లో 13 వ ఓవర్ నడుస్తోంది. ఈ ఓవర్‌ను డేన్ బ్రావో వేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఓవర్ నాల్గవ బంతి బౌల్ చేయగా, బ్రావో కింద పడిపోయాడు. అప్పుడు పరుగు తీస్తున్న హెట్‌మెయిర్, సరదాగా అతని వైపు బ్యాట్ చూపించాడు. ఏదేమైనా, తరువాత హెట్‌మెయిర్‌తోపాటు అతని భాగస్వామి హఫీజ్ ఇద్దరూ బ్రావోను కౌగిలించుకోవడం ద్వారా ఆట స్ఫూర్తికి గొప్ప ఉదాహరణ అందించారు.

ఇదే మ్యాచ్‌లో మరో ఫన్నీ సంఘటన..
అదే మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ ఇన్నింగ్ సమయంలో మరో ఫన్నీ సంఘటన జరిగింది. అప్పటికే 10 ఓవర్లు ఆడటం జరిగింది. అప్పుడు మైదానంలో ఎక్కడి నుంచో ఓ కోడి ఎంటరైంది. దీని కారణంగా ఆట కొద్ది క్షణాలపాటు నిలిపేశారు. మైదానంలో చాలాసేపు తిరుగుతూ కనిపించింది. డ్వేన్ బ్రావో నేతృత్వంలోని జట్టు గయానా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 బంతుల్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు.

Also Read:

INDW vs AUSW: ఆస్ట్రేలియా చేరిన టీమిండియా మహిళల జట్టు.. విమానంలో సందడే సందడి

IND vs ENG: హెడింగ్లీ ఓటమి తర్వాత టీమిండియాలో మార్పులు.. ఓవల్ టెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఎలా ఉండబోతోదంటే..?