క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ.!

|

May 01, 2021 | 12:18 PM

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌.. రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్‌..

క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ.!
ashwin
Follow us on

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌.. రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్‌ సోకిన్నట్లు అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌ తెలిపింది. గత కొద్ది రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్న తాము.. కోవిడ్‌ టెస్టులు చేయించుకోగా.. అందరికీ కరోనా పాజిటివ్‌ వచ్చిందని ట్వీట్‌లో పేర్కొంది.

పాజిటివ్‌ వచ్చిన వారిలో.. ఆరుగురు పెద్దవాళ్లతో పాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు వెల్లడించింది ప్రీతి. ఇంట్లోని పిల్లల కారణంగానే వైరస్ అందరికీ వ్యాపించిందన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడిన అశ్విన్‌.. గతవారమే మొత్తం సీజన్‌ నుంచే తప్పుకున్నాడు. కొవిడ్‌-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు అశ్విన్‌.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

 కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!