SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో తాగుబోతుల హల్‌చల్.. క్రికెట్ ఫ్యాన్స్ మధ్య గొడవ..

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది.

SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో తాగుబోతుల హల్‌చల్.. క్రికెట్ ఫ్యాన్స్ మధ్య గొడవ..
Srh , Mi Fans

Updated on: Apr 18, 2023 | 10:09 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. హైదరాబాద్ ఈ టార్గెట్ ను ఛేదించే పనిలో ఉండగా .. స్టేడియంలో తాగుబోతుల హల్ చల్ చేశారు.

క్రికెట్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. దాంతో ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఫ్యాన్స్ గొడవపడుతుండటంతో ఫ్యాన్స్ అడ్డుకున్న పోలీసులు.

ఫ్యాన్స్ మద్యం మదత్తులో ఉన్నారని తెలుస్తోంది. కాగా ఫ్యాన్స్ పోలీసులతోనూ వాగ్వాదంకు దిగగారు. గొడవ చేస్తున్న వాళ్ళను బయటకు పంపేశారు పోలీసులు.

Loading...
Unable to load recommendations.
Follow Us