Cricket: 39 ఫోర్లు, 7 సిక్సర్లు.. సెంచరీలతో బౌలర్ల ఊచకోత.. వన్డేల్లో మరో రికార్డు!

|

Aug 24, 2022 | 9:23 AM

6,6,4,4,6,6.. ఇవి ఫోన్ నెంబర్‌లోని సంఖ్యలు కావు.. ఇద్దరు బ్యాటర్లు స్కోర్ బోర్డుపై సృష్టించిన బీభత్సం. బౌండరీలతో బౌలర్లను ఉతికారేశారు.

Cricket: 39 ఫోర్లు, 7 సిక్సర్లు.. సెంచరీలతో బౌలర్ల ఊచకోత.. వన్డేల్లో మరో రికార్డు!
Tom Alsop & Pujara
Follow us on

ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న రాయల్ లండన్ కప్ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్లు ఊచకోత కోస్తున్నారు. ముఖ్యంగా ససెక్స్ బ్యాటర్లు ప్రతీ మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ తమ జట్టుకు అద్భుత విజయాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ససెక్స్ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని అందుకుని.. సెమీఫైనల్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ససెక్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా వెటరన్ ఆటగాడు పుజారాతో పాటు ఓపెనర్ అల్సోప్ అద్భుతమైన సెంచరీలతో అదరగొట్టారు. మంగళవారం మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌లకు ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 400 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది.

ఓపెనర్ అల్సోప్ 155 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 189 పరుగులు చేయగా.. కెప్టెన్ పుజారా 90 బంతులు ఎదుర్కొన్న పుజారా 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులు సాధించాడు. టెస్ట్ బ్యాటర్‌గా పేరొందిన పుజారా కేవలం 75 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకోవడం గమనార్హం. ఈ టోర్నీలో పూజారాకి ఇది మూడో సెంచరీ కాగా.. అల్సోప్‌ది తొలి సెంచరీ.

మరోవైపు భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్ జట్టు 243 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు వికెట్ కీపర్ క్రాక్‌నెల్(71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ససెక్స్ బౌలర్లలో క్రోకంబ్, రాలిన్స్ చెరో 3 వికెట్లు.. కర్వేలాస్, కర్రీ, ప్రెంటిస్, కలేస్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ విజయంతో ససెక్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడమే కాదు.. సెమీఫైనల్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..