ఒకవైపు ఐపీఎల్(IPL 2022) ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నారు. అదే సమయంలో ఓ ఆటగాడు ప్యారిస్ నుంచి నేరుగా టీమ్ ఇండియాలో తిరిగి చోటు దక్కించుకున్నారు. దీనిపై అతను స్పందిస్తూ “నేను ఐపీఎల్ ఆడకపోవడం విశేషం. ఎందుకంటే నేను ఆడితే నాకు ఈ అవకాశం వచ్చేది కాదు.” అని అన్నాడు ఆ ప్లేయర్ ఎవరో కాదు మళ్లీ టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న చెతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara). ఏది జరిగినా అది మంచికే జరుగుతుందని అంటారు. పుజారా విషయంలోనూ అదే జరిగింది. ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో 10 జట్లలో ఎవరూ అతన్ని కొనుగోలు చేయలేదు. దీంతో అతను సస్సెక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడే అవకాశాన్ని పొందాడు. కౌంటీలో రాణించడంతో టెస్ట్ జట్టులో తిరిగి వచ్చాడు. పుజారా సస్సెక్స్ తరపున ఆడిన 5 కౌంటీ మ్యాచ్‌లలో 120 సగటుతో 720 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు, సెంచరీలు ఉన్నాయి.
టీమ్ ఇండియాలో తన ఎంపిక తర్వాత ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన పుజారా, “నేను ఐపిఎల్ ఆడినట్లయితే, నేను ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉండేది. లేదంటే వారికి అదృష్టం కలిసి వచ్చేది కాదు. నేను నెట్స్‌కి వెళ్లి సాధన చేయడం మాత్రమే చూసాను. కానీ మ్యాచ్ ప్రాక్టీస్, నెట్ ప్రాక్టీస్ పూర్తి భిన్నంగా ఉంటాయి. కాబట్టి నేను కౌంటీతో ఒప్పందం చేసుకున్నప్పుడు, పాత రిథమ్‌కి తిరిగి రావడానికి నాకు ఈ అవకాశం దక్కింది.” అని అన్నాడు. కౌంటీ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పుజారాకు టీమిండియాలో చోటు దక్కలేదు. అతడిని జట్టు నుంచి తప్పించారు.
మరిన్ని క్రీడావార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..