PBKS vs CSK IPL 2021: సునాయాసంగా విజయం సొంతం చేసుకున్న చెన్నై.. పంజాబ్‌ను చిత్తు చేసిన ధోనీ సేన..

|

Apr 16, 2021 | 11:54 PM

PBKS vs CSK IPL 2021: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ధోనీ సేన టోర్నీలో తొలి విజయాన్ని సొంతం చేసుకుని బోణీ కొట్టింది. పంజాబ్‌...

PBKS vs CSK IPL 2021: సునాయాసంగా విజయం సొంతం చేసుకున్న చెన్నై.. పంజాబ్‌ను చిత్తు చేసిన ధోనీ సేన..
Chennai Won The Match
Follow us on

PBKS vs CSK IPL 2021: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ధోనీ సేన టోర్నీలో తొలి విజయాన్ని సొంతం చేసుకుని బోణీ కొట్టింది. పంజాబ్‌ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. చెన్నై బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో పంజాబ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఇదే స్వల్ప స్కోర్‌ కావడం గ‌మ‌నార్హం.

106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5) తక్కువ పరుగులకే వెనుదిరిగినా.. ఫాఫ్‌డూ ప్లెసిన్‌ 33 పరుగులు, మొయిన్‌ అలీ 46 పరుగులతో రాణించారు. ఇక అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ (13/4) అద్భుత ప్రదర్శనతో పంజాబ్‌ మొదట‌ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.

ఈ విజయంతో చెన్నై.. ఐపీఎల్ 14వ సీజన్లో పాయింట్ల ఖాతా తెరిచింది. ఇక పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమి 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ దక్కాయి. కాగా.. చెన్నై బౌలర్లలో 4 వికెట్లతో రాణించిన దీపక్ చాహర్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Also Read: పెళ్లైన మూడు సంవత్సరాల్లో 18 సార్లు ఇళ్లు మారిన జంట.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Ayodhya Ram Temple: రాములోరి ఆలయానికి చెల్లని విరాళాలు.. వీటి విలువ అక్షరాల రూ. 22 కోట్లు..

షాకింగ్ న్యూస్.. గాలి ద్వారానే కరోనా వ్యాప్తి.. అధ్యాయనాల్లో బయటపడ్డ సంచలన విషయాలు..