
సఫారీలతో జరగబోయే రెండో టెస్టుకు ముందుగా న్యూజిలాండ్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ డారీ మిచెల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి బొటనవేలుకు గాయం అయింది.. అది కాస్తా తీవ్రతరం కావడంతో టీం మేనేజ్‌మెంట్ మిచెల్‌కు రెస్ట్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. మిచెల్ తన గాయం నుంచి కోలుకునేందుకు దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్టు మెడికల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడు ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్టు సమాచారం. మూడు ఫార్మాట్లకు మిచెల్ కీలక ఆటగాడు. అతడు జట్టుకు ఎంతో అవసరం. అతడికి గాయం కావడం తమ దురదృష్టం అని హెడ్‌కోచ్ గ్యారీ స్టీడ్ అన్నాడు.
మరోవైపు మిచెల్ గాయం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును డైలమాలో పడేసింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మిచెల్‌ను రూ. 14 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఒకవేళ ఆ సమయానికి మిచెల్ కోలుకోకపోతే.. చెన్నైకు పెద్ద దెబ్బే తగలనుంది. అయితే ఐపీఎల్‌కు ఇంకాస్త సమయం ఉండటంతో.. మిచెల్ ఆలోపే కోలుకునే ఛాన్స్ ఉంది.