Chennai Super Kings: సీఎస్‌కే ఖాతాలో మరో రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి ఐపీఎల్ జట్టుగా ధోని టీమ్..

|

Aug 17, 2023 | 10:02 PM

Chennai Super Kings: ఇటీవల జరిగిన టోర్నీ విజేతగా నిలిచిన సీఎస్‌కే టీమ్.. లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డ్‌ను సమం చేసింది. ఐపీఎల్ సీజన్ ముగిసి నెలలు గడుస్తున్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. అదేలా అంటే.. ట్విట్టర్‌లో 10 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా సీఎస్‌కే..

Chennai Super Kings: సీఎస్‌కే ఖాతాలో మరో రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి ఐపీఎల్ జట్టుగా ధోని టీమ్..
Chennai Super Kings
Follow us on

Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ఆదరణ పొందిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎంఎస్ ధోని సారథ్యంలో ఇటీవల జరిగిన టోర్నీ విజేతగా నిలిచిన సీఎస్‌కే టీమ్.. లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డ్‌ను సమం చేసింది. ఐపీఎల్ సీజన్ ముగిసి నెలలు గడుస్తున్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. అదేలా అంటే.. ట్విట్టర్‌లో 10 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా సీఎస్‌కే ఆవతరిచింది. ఈ మేరకు ‘థ్యాంక్స్ ఎ 10’ అంటూ తన ఫాలోవర్లకు ధన్యవాదాలు తెలిపింది సీఎస్‌కే సోషల్ మీడియా టీమ్.

10 మిలియన్ల ఫాలోవర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన జట్టుగా అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కి ట్విట్టర్‌లో 8.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇంకా 6.8 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో, 5.2 ట్విట్టర్ ఫాలోవర్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ నాల్గో స్థానంలో, 3.2 మిలియన్లు ఫాలోవర్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ (2.9 మిలియన్ల ఫాలోవర్లు), రాజస్థాన్ రాయల్స్ (2.7  మిలియన్ల ఫాలోవర్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (2.5 మిలియన్ల ఫాలోవర్లు), లక్నో సూపర్ జెయింట్స్ (7 లక్షల 60 వేల ఫాలోవర్లు), గుజరాత్ టైటాన్స్ 5 లక్షల 22 వేల ఫాలోవర్లతో వరుస స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

10 మిలియన్ల ఫాలోవర్లు..

ధోని బర్తడే..

ఐపీఎల్ ఫైనల్ మూమెంట్స్..

ది చాంప్స్..

జడ్డూ భాయ్..

డాడీ లయన్..

లవ్‌యూ రాయుడు..

కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్‌లో చెన్నై టీమ్ గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి, 5వ సారి టోర్నీ విజేతగా నిలిచింది. ఇంకా ఆ మ్యాచ్‌లో విజయం కోసం చివరి రెడు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో రవీంద్ర జడేజా ఒక సిక్సర్, ఒక బౌండరీతో హీరోగా నిలిచాడు.