
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీ ఫైనల్ సినారియో ఇంట్రెస్టింగ్‌గా మారింది. గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇదే గ్రూప్ నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక గ్రూప్-బీ నుంచి మాత్రం ఇంకా ఒక్క టీమ్ కూడా సెమీ ఫైనల్‌కు చేరలేదు. కానీ, ఆ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే ఎలిమినేట్ అయింది. ఇక రెండు సెమీస్ బెర్త్‌ల కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఈ రేసులో ముందుంటే.. ఆప్ఘానిస్థాన్ కూడా వాటికి పోటీ ఇస్తోంది. బుధవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆఫ్ఘాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
ఒక వేళ ఆఫ్ఘాన్ సెమీస్ చేరాలంటే ఈ నెల 28న అంటే శుక్రవారం ఆస్ట్రేలియాపై గెలిచి తీరాలి. ఒక వేళ ఓడితే మాత్రం ఆఫ్ఘాన్ ఇంటికి, ఆసీస్ సెమీస్‌కు చేరుతాయి. ఆసీస్‌తో పాటు సౌతాఫ్రికా కూడా సెమీస్‌కు వెళ్తుంది. ఇప్పటి వరకు ఉన్న పాయింట్ల పట్టికను చూస్తే.. ఆసీస్, సౌతాఫ్రికా మూడేసి పాయింట్లతో ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆఫ్ఘాన్ రెండు పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్‌లో టీమిండియాకు ఎవరు పోటీకి వస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆఫ్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా గెలిస్తే.. 5 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా గెలిస్తే ఆ జట్టు కూడా ఐదు పాయింట్ల సెమీస్ చేరుతుంది. అయితే రన్‌రేట్ ఆధారంగా గ్రూప్-బీ టాపర్ ఎవరనేది తేలుతుంది. ఒక వేళ ఆస్ట్రేలియాపై ఆఫ్ఘాన్ గెలిచి, ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా గెలిస్తే.. సౌతాఫ్రికా ఫస్ట్ ప్లేస్‌లో, ఆఫ్ఘాన్ సెకండ్ ప్లేస్‌లో సెమీస్‌కు చేరుతాయి.
మరోవైపు గ్రూప్-ఏలో ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ టాపర్‌గా, ఓడిని జట్టు సెకండ్ ప్లేస్‌లో సెమీస్‌కు చేరుతాయి. గ్రూప్-ఏ టాపర్, గ్రూప్ బీ సెకండ్ ప్లేస్‌లో ఉన్న టీమ్ మధ్య తొలి సెమీస్ ఫైనల్ జరుగుతుంది. అలాగే గ్రూప్ బీ టాపర్, గ్రూప్ ఏ సెకండ్ ప్లేస్‌లో నిలిచిన జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. సో టీమిండియా మార్చ్ 2న న్యూజిలాండ్‌పై గెలిస్తే సెమీస్‌లో ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికాతో తలపడాల్సి ఉంటుంది. ఆఫ్ఘాన్‌తో కూడా తలపడే అవకాశం ఉంది కానీ, దానికి చాలా సమీకరణాలు కలిసి రావాలి. ఆఫ్గాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయి, ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా గెలిస్తే.. గ్రూప్ బీ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో సౌతాఫ్రికా, రెండో ప్లేస్‌లో ఆఫ్ఘాన్ సెమీస్‌కు వస్తాయి. అప్పుడు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఇంగ్లండ్ ఓటమికి కారణమైన సొంత దేశ ఆటగాడు! ఆఫ్ఘాన్ వెనకున్న శక్తి అతనే
అలా కాకుండా న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోతే.. గ్రూప్-ఏ నుంచి రెండో ప్లేస్‌లో ఇండియా సెమీస్‌కు చేరుతుంది. అప్పుడు కూడా ఆఫ్ఘాన్‌తో సెమీస్ ఆడాలంటే.. ఆసీస్‌పై ఆఫ్ఘాన్ గెలవాలి, ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాలి. అప్పుడు ఆఫ్ఘాన్ గ్రూప్-బీ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో, ఆసీస్, సౌతాఫ్రికా జట్లు మూడేసి పాయింట్లతో ఉంటాయి కాబట్టి వాటిలో మెరుగైన రన్‌రేట్ ఉన్న టీమ్ రెండో ప్లేస్‌లో సెమీస్ చేరుతుంది. అప్పుడు.. గ్రూప్-బీ టాపర్‌గా ఆఫ్ఘాన్, గ్రూప్-ఏ సెకండ్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇలా అనేక ఈక్వేషన్ల మధ్య టీమిండియాకు సెమీస్‌లో ఆసీస్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ ఇలా ఎవరైనా రావొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.