IPL 2023: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన నిర్ణయం.. కొత్త హెడ్‌ కోచ్‌గా ఆ క్రికెట్‌ దిగ్గజం

|

Sep 03, 2022 | 3:55 PM

Sunrisers Hyderabad: ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది. అయితే అప్పుడే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సీజన్లుగా జట్టు పేలవమైన ప్రదర్శన చేస్తుండడంతో హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా దిగ్గజం టామ్‌ మూడీని తొలగించింది.

IPL 2023: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన నిర్ణయం.. కొత్త హెడ్‌ కోచ్‌గా ఆ క్రికెట్‌ దిగ్గజం
Sunrisers Hyderabad
Follow us on

Sunrisers Hyderabad: ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది. అయితే అప్పుడే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సీజన్లుగా జట్టు పేలవమైన ప్రదర్శన చేస్తుండడంతో హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా దిగ్గజం టామ్‌ మూడీని తొలగించింది. అతని స్థానంలో వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్‌ బ్రియాన్ లారా (Brian Lara) ను ప్రధాన కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రకటించింది. ‘క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లకు మా జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నారు’ అని సన్‌రైజర్స్ ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం లారా ప్రస్తుతం సన్‌రైజర్స్‌ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ లారాతో ఒప్పందం కుదుర్చకుంది.

మూడీ హయాంలోనే టైటిల్‌..
కాగా సన్‌రైజర్స్‌ యాజమాన్యం, టామ్‌ మూడీ పరస్పర అంగీకారంతోనే తమ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మూడీ రెండుసార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. ఆయన హయాంలో మొత్తం 9 ఐపీఎల్‌ సీజన్లలో పాల్గొంది. అందులో 5 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2016లో టైటిల్‌ను కూడా గెలుచుకుంది. అయితే 2021, 2022 సీజన్లలో సన్‌రైజర్స్‌ దారుణంగా విఫలమైంది. 2021లో మూడు విజయాలను మాత్రమే అందుకున్న హైదరాబాద్‌ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో గెలిచి 8వ స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..