5 వరుస బంతులు.. 5 వికెట్లు.. హ్యాట్రిక్‌తోపాటు ప్రపంచ రికార్డు.. ఈ బౌలర్ దెబ్బకు బ్యాటర్స్ మటాష్

|

Oct 27, 2021 | 6:27 PM

టీ20 ప్రపంచ కప్ 2021 అభిమానుల సందడి మధ్య, ఓ మహిళా బౌలర్ క్రికెట్ మైదానంలో విధ్వంసం సృష్టించింది. చివరి ఓవర్‌లో బౌలింగ్ చేసి, ఐదు వరుస బంతుల్లో ఐదుగురు బ్యాట్స్‌ ఉమెన్స్‌ను పెవిలియన్ చేర్చింది.

5 వరుస బంతులు.. 5 వికెట్లు.. హ్యాట్రిక్‌తోపాటు ప్రపంచ రికార్డు.. ఈ బౌలర్ దెబ్బకు బ్యాటర్స్ మటాష్
Brazil Bowler Laura Cardoso
Follow us on

టీ20 ప్రపంచ కప్ 2021 అభిమానుల సందడి మధ్య, ఓ మహిళా బౌలర్ క్రికెట్ మైదానంలో విధ్వంసం సృష్టించింది. చివరి ఓవర్‌లో బౌలింగ్ చేసి, ఐదు వరుస బంతుల్లో ఐదుగురు బ్యాట్స్‌ ఉమెన్స్‌ను పెవిలియన్ చేర్చింది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్‌ కూడా నమోదైంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కెనడా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. బ్రెజిల్ వర్సెస్ కెనడా మహిళల జట్ల మధ్య ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ యూఎస్ రీజియన్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఇందులో బ్రెజిల్ క్రీడాకారిణి లారా కార్డోసో వేసిన చివరి ఓవర్‌లో ఆరు బంతుల్లో ఐదు వికెట్లు పడ్డాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మ్యాచ్ 20 ఓవర్లు జరగాల్సి ఉన్నా.. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రెజిల్ మహిళా క్రికెట్ జట్టు 7 వికెట్లకు 48 పరుగులు చేసింది. కెప్టెన్ రాబర్టా అవరీ అత్యధికంగా 21 పరుగులు చేసింది. మరో బ్యాటర్ ఎవరు కూడా 10 పరుగులను చేరుకోలేకపోయారు. కెనడా మహిళల జట్టు తరఫున హిబా శంసాద్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఎనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. అదే సమయంలో అజ్మత్ 11 పరుగులకే రెండు వికెట్లు తీసింది. బ్రెజిల్ మొత్తం ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు మాత్రమే వచ్చాయి. వీటిని కెప్టెన్ రాబర్టా అవేరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో కెనడా ముందు 49 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెనడా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్క బ్యాట్స్‌ ఉమెన్ ముఖ్విందర్ గిల్ మాత్రమే డబుల్ ఫిగర్‌ను తాకింది. గిల్ 19 పరుగులు చేసింది. కెనడా ఒక దశలో 19 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయినా ముఖ్విందర్ గిల్ జట్టును విజయానికి చేరువ చేశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి కెనడా స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 46 పరుగులకు చేరింది. చివరి ఓవర్‌లో కెనడా విజయానికి మూడు పరుగులు మాత్రమే అవసరం కాగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి.

లారా కార్డోసో చివరి ఓవర్‌లో బ్రెజిల్‌కు బౌలింగ్ బాధ్యతలు చేపట్టింది. ఈ ఓవర్‌కు ముందు ఆమె రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక మెయిడిన్‌తో ఏడు పరుగులు ఇచ్చింది. వికెట్ మాత్రం దక్కలేదు. ముఖ్విందర్ గిల్ చివరి ఓవర్ తొలి బంతిని ఆడినా పరుగులేమీ రాలేదు. రెండో బంతికి పరుగు తీసే ప్రయత్నం జరిగినా క్రమా కపాడియా రనౌట్ అయ్యాడు. మూడో బంతికి హలా అజ్మత్, నాలుగో బంతికి హిబా శంషాద్ బౌల్డ్ అయ్యారు. ఐదో బంతికి సనా జాఫర్ బ్రెజిల్ కెప్టెన్ రాబర్టా అవరీకి క్యాచ్ ఇచ్చింది. ఈ విధంగా లారా హ్యాట్రిక్ సాధించింది. అలాగే ఓవర్లో నాలుగు వికెట్లు పడినా ఒక్క పరుగు కూడా రాలేదు. చివరి బంతికి ముఖ్విందర్ గిల్ పరుగు తీసేందుకు ప్రయత్నించినా రెండో పరుగు ప్రయత్నంలో ఆమె కూడా రనౌట్ అయింది. దీంతో బ్రెజిల్ దాదాపు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో లారా కార్డోసో మూడు ఓవర్లలో ఒక మెయిడిన్‌తో ఎనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. ఒక్క పరుగు తేడాతో జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించింది. క్వాలిఫయర్స్‌లో బ్రెజిల్ ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగు గెలిచింది. అమెరికాపై రెండుసార్లు ఓడిపోయింది. లారా కార్డోసో ఆరు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసింది. వికెట్లు తీయడంలో ఆమె ముందుంది. ఐదుగురు కెనడా బ్యాట్స్‌ ఉమెన్‌లు 5 బంతుల్లో ఔటయ్యారు. ఒక ఓవర్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించింది. బ్రెజిల్ కెప్టెన్ రాబర్టా అవరీ, మహిళల ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో జట్టును అద్భుతంగా నడిపించింది. బ్రెజిల్ జట్టుకు సంబంధించిన అప్‌డేట్‌లకు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటుంది.

Also Read: Khel Ratna Award: ఖేల్ రత్న రేసులో గోల్డెన్ బాయ్.. అర్జున అవార్డుకు 35 మంది ఎంపిక.. లిస్టులో ఎవరున్నారంటే?

ICC T20 Rankings: పాక్ ఓపెనర్ దెబ్బకు దిగజారిన కోహ్లీ ప్లేస్.. అదే బాటలో కేఎల్ రాహుల్ కూడా..!