BPL: 64 బంతుల్లో 111 పరుగులు.. ప్రత్యర్థి టీం భారీ స్కోర్ చేసినా.. తుఫాన్ సెంచరీతో తుస్సుమనిపించాడు..

|

Jan 29, 2022 | 7:01 AM

Bangladesh Premier League: టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి 6 నెలల విరామం తీసుకున్నాడు. ఇలాంటి ప్రకటన వెలువడిన మరుసటి రోజే తుఫాన్ సెంచరీతో వార్తల్లో నిలిచాడు.

BPL: 64 బంతుల్లో 111 పరుగులు.. ప్రత్యర్థి టీం భారీ స్కోర్ చేసినా.. తుఫాన్ సెంచరీతో తుస్సుమనిపించాడు..
tamim Iqbal
Follow us on

Bangladesh Premier League: టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి 6 నెలల విరామం తీసుకున్నాడు. ఇలాంటి ప్రకటన వెలువడిన మరుసటి రోజే తుఫాన్ సెంచరీతో వార్తల్లో నిలిచాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL 2022) లో బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు . ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ ఓపెనర్‌ 173 పరుగుల బ్యాగస్వామ్యాన్ని అందించాడు. తమీమ్ ఇక్బాల్ బ్యాట్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఆటగాడు 64 బంతుల్లో అజేయంగా 111 పరుగులు చేశాడు. దీంతో 17 ఓవర్లలో అతని జట్టు మినిస్టర్ గ్రూప్ ఢాకా (Sylhet Sunrisers vs Minister Group Dhaka) కి విజయాన్ని అందించాడు. తమీమ్ ఇక్బాల్‌తో పాటు వికెట్‌కీపర్ మహ్మద్ షాజాద్ 39 బంతుల్లో 53 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మధ్య 173 పరుగుల భాగస్వామ్యం ఉంది.

సిల్హెట్ సన్‌రైజర్స్ నుంచి కూడా అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ కనిపించింది. జట్టు ఓపెనర్ లెండిల్ సిమన్స్ 65 బంతుల్లో 116 పరుగులు చేశాడు. 5 సిక్సర్లు, 14 ఫోర్లు సిమన్స్ బ్యాట్ నుంచి వచ్చాయి. అయినప్పటికీ అతను తన జట్టును గెలిపించలేకపోయాడు. లీగ్‌లో సిల్హెట్ సన్‌రైజర్స్ తమ రెండో మ్యాచ్‌లో ఓడిపోగా, మినిస్టర్ గ్రూప్ ఢాకా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది.

తమీమ్ ఇక్బాల్ తుఫాన్ చిట్టగాంగ్‌ను తాకింది..
చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మినిస్టర్ గ్రూప్ ఢాకా కెప్టెన్ మహ్మదుల్లా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. లెండిల్ సిమన్స్ క్రీజులోకి దిగిన వెంటనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరంభంలో ఇనాముల్ హక్ 2 ఫోర్లు, ఒక సిక్సర్ బాదినా ఇబాదత్ హొస్సేన్ అతడిని ఔట్ చేసింది. ఆ తర్వాత 8వ ఓవర్‌లో మహ్మద్‌ మిథున్‌ వికెట్‌ను కూడా జట్టు కోల్పోయింది. కానీ సిమన్స్ పవర్‌ప్లేలో చురుగ్గా బ్యాటింగ్ చేస్తూ జట్టు స్కోరు 50కి చేరేలా చేశాడు. సిమన్స్ కేవలం 34 బంతుల్లోనే తన యాభైని పూర్తి చేశాడు. అయితే, మరోవైపు, సిల్హెట్ కోలిన్ ఇంగ్రామ్ వికెట్ కోల్పోయాడు. అతను ఖాతా కూడా తెరవలేకపోయాడు. దీంతో సిమ్మన్స్, రవి బొపారా మధ్య నాలుగో వికెట్‌కు 33 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. హాఫ్ సెంచరీ తర్వాత కూడా సిమన్స్ జోరుగా బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ బ్యాట్స్‌మన్ కేవలం 59 బంతుల్లోనే సెంచరీని చేరుకున్నాడు. సిల్హెట్ 18 ఓవర్లలో 150 పరుగులు పూర్తి చేశాడు.

తమీమ్ ఇక్బాల్-మహమ్మద్ షాజాద్ జోడీ సంచలన ఇన్నింగ్స్..
సిల్హెట్ మంచి స్కోరును నమోదు చేసినట్లు అనిపించింది. అయితే మినిస్టర్ గ్రూప్ ఢాకా ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, మహ్మద్ షాజాద్ అది తక్కువే అని నిరూపించారు. ఇద్దరూ పవర్‌ప్లేలోనే 74 పరుగులు చేశారు. 4.1 ఓవర్లలో ఢాకా 50 పరుగులు పూర్తయ్యాయి. తమీమ్ ఇక్బాల్ కేవలం 28 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. షాజాద్‌తో కలిసి కేవలం 8.5 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. షాజాద్ 34 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయడంతో జట్టు ఏకపక్ష విజయం దిశగా సాగడం ప్రారంభించింది. తమీమ్ ఇక్బాల్ 61 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే లక్ష్యానికి కేవలం 3 పరుగుల ముందు షాజాద్ 53 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే అప్పటికి మ్యాచ్ సిల్హెట్ సన్‌రైజర్స్ చేతుల్లోంచి చేజారిపోయింది.

Also Read: Rohith Sharma: రోహిత్ శర్మను టెస్ట్ కెప్టెన్‌ చేయాలి.. కానీ అతనికి ఫిట్‌నెసే పెద్ద సమస్య..

MS Dhoni: ఎంఎస్ ధోనీని చూసి చాలా నేర్చుకున్నా.. అతను ప్రశాంతంగా జట్టును నడిపిస్తాడు..