
కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖల వరకు ఇబ్బంది పడుతోంది. వారినే వారి కుటంబాలను కూడా ఇబ్బంది పెడుతోంది. తాజాగా టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు. అతని తల్లి ఇంద్రేష్ దేవి పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో అతని తల్లి ఇంద్రేష్ దేవిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆమెను యూపీ మేరఠ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
గర్భవతి అయినా భువీ భార్య నూపుర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. గత నెల 20న భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్.. క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందారు. అనంతరం ఆయన కర్మకాండలను బులంద్ షహర్‌లోని లుహార్లిలో చేశారు.
తర్వాతి రోజు భువీతో పాటు కుటుంబ సభ్యులందరూ కొవిడ్ టెస్ట్ చేయించుకోగా.. వారందరికీ నెగెటివ్‌గా తేలింది. నాలుగో రోజుల తర్వాత భువీ తల్లి ఇంద్రేష్కు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో మరో సారి పరీక్షలు చేయించగా.. కరోనా నిర్ధరణ అయింది. దీంతో వీరంతా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఆయన తల్లికి ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆక్సిజన్ స్థాయి పడిపోతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.