Video: W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించని విధ్వంసం.. 7 పరుగులు, 8 వికెట్లతో డేంజరస్ బౌలింగ్..

T20 Records: గెలెఫు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ అపురూప ఘనత నమోదైంది. సోనమ్ ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ బౌలింగ్ ప్రత్యర్థికి అంతుచిక్కలేదు. అతని బంతుల్లోని వైవిధ్యం, స్వింగ్‌ను అర్థం చేసుకోవడంలో మయన్మార్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో, ఒక టీ20 ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన మలేషియా బౌలర్ స్యాజ్రుల్ ఇద్రస్ పేరిట ఉన్న పాత రికార్డును సోనమ్ బద్దలు కొట్టాడు.

Video: W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించని విధ్వంసం.. 7 పరుగులు, 8 వికెట్లతో డేంజరస్ బౌలింగ్..
Orthodox Spinner Sonam Yeshey

Updated on: Dec 29, 2025 | 11:40 AM

సాధారణంగా బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో, ఒక బౌలర్ నమ్మశక్యం కాని ప్రదర్శన చేశాడు. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ తన కోటాలోని నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరీ ముఖ్యంగా, ఆ నాలుగు ఓవర్లలోనే ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టడం ఈ ప్రదర్శనను అత్యంత అద్భుతంగా మార్చుకున్నాడు. అతని ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానమే లేదు. ఈ స్పెల్ ఇప్పుడు టీ20 అంతర్జాతీయ (T20I) చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిపోయింది.

టీ20 క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలను ఇప్పటి వరకు ఎన్నో చూశాం. కానీ బౌలింగ్‌తో ఇంతలా ఆధిపత్యం చెలాయించడం చాలా అరుదు. 26 డిసెంబర్ 2025న, భూటాన్‌కు చెందిన ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్ సోనమ్ యెషే టువంటి చారిత్రాత్మక ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

ఇవి కూడా చదవండి

మయన్మార్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో సోనమ్ ఆడుతూ, ఎప్పటికీ గుర్తుండిపోయే గణాంకాలను నమోదు చేశాడు. అతని పదునైన బంతులు, వేగవంతమైన టర్న్, నిరంతర ఒత్తిడి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను పూర్తిగా కుప్పకూల్చాయి.

భారీ షాట్లు, పరుగుల వరదకు పెట్టింది పేరైన ఈ ఫార్మాట్‌లో, బౌలింగ్ కూడా ఎలా శాసించగలదో చెప్పడానికి సోనమ్ స్పెల్ ఒక అసాధారణ ఉదాహరణ. ఈ ప్రదర్శనతో సోనమ్ భూటాన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడమే కాకుండా, రికార్డు పుస్తకాల్లో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నాడు.

రికార్డు బద్దలు కొట్టిన స్పెల్.. కేవలం 7 పరుగులకు 8 వికెట్లు..

టీ20 అంతర్జాతీయ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ రికార్డును సోనమ్ యెషే తన పేరిట రాసుకున్నాడు. పురుషుల, మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా ఆయన నిలిచాడు. భూటాన్‌కు చెందిన ఈ బౌలర్ ఒక మెయిడెన్ ఓవర్‌తో సహా తన నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ధాటికి మయన్మార్ జట్టు పూర్తిగా నిస్సహాయ స్థితికి చేరుకుంది.

ఇది కూడా చదవండి: Team India: టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా యువ సంచలనం.. సూర్యకుమార్‌పై వేటు.. గిల్‌కు నో ఛాన్స్.?

సోనమ్ ధాటికి కుప్పకూలిన మయన్మార్ బ్యాటింగ్..

మ్యాచ్ ప్రారంభంలో మొదట బ్యాటింగ్ చేసిన భూటాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఇది పోరాడదగ్గ స్కోరే అయినప్పటికీ, మరీ భారీ స్కోరు మాత్రం కాదు. అయితే, ఆ తర్వాత టీ20 చరిత్రలోనే అత్యంత అనూహ్యమైన బ్యాటింగ్ పతనం చోటుచేసుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ జట్టు కేవలం 9.2 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆనంద్ మోంగర్ తీసిన రెండు వికెట్లు మినహా, మిగిలిన మొత్తం మ్యాచ్ సోనమ్ యెషే ఆధిపత్యమే కనిపించింది. మయన్మార్ బ్యాటర్లు పేకమేడల్లా కూలిపోయారు. ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఈ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో భూటాన్ మ్యాచ్ గెలవడమే కాకుండా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో అజేయ ఆధిక్యాన్ని సాధించింది.

ఇది కూడా చదవండి: Team India: ద్రవిడ్ హయాంలో తోపు ఫినిషర్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌గా మార్చిన గంభీర్..

భూటాన్ క్రికెట్‌కు ఒక చారిత్రాత్మక క్షణం..

సోనమ్ యెషే ప్రదర్శన టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత భయంకరమైన బౌలింగ్ గణాంకాలుగా పరిగణిస్తున్నారు. ఇది భూటాన్ క్రికెట్‌కు ఒక గొప్ప విజయం, ప్రపంచ వేదికపై ఆ దేశం ఎదుగుదలకు ఇది నిదర్శనం. ఇలాంటి ప్రదర్శనలు వర్ధమాన క్రికెట్ దేశాలకు స్ఫూర్తినిస్తాయి.

టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (పురుషులు):

సోనమ్ యెషే (భూటాన్) 8 వికెట్లు

స్యాజ్రుల్ ఇద్రుస్ (మలేషియా) 7 వికెట్లు

అలీ దావుద్ (బహ్రెయిన్) 7 వికెట్లు

హర్ష్ భరద్వాజ్ (సింగపూర్) 6 వికెట్లు

పీటర్ అహో (నైజీరియా) 6 వికెట్లు.

 

ఈ చారిత్రాత్మక బౌలింగ్‌తో సోనమ్ యెషే కేవలం ఒక మ్యాచ్‌ను గెలిపించడమే కాకుండా, టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రనే మార్చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..