
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీ20 తరహలో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్. 69 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసిన హెడ్.. మొత్తంగా 83 బంతుల్లోనే 123 పరుగులు బాదాడు. లాబూషెన్ 51 పరుగులతో రాణించాడు.
పెర్త్‌లో జరిగిన ఈ తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలర్లు విశ్వరూపం చూపించారు. మొదటిగా ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ రెండు ఇన్నింగ్స్‌కు కలిపి 63 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లతో అదరగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఈ టెస్టులో ఆస్ట్రేలియా విధ్వసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడుకోవాలి.. ఒక్కరు కూడా పెద్ద భాగస్వామ్యం నెలకొల్పలేకపోయిన ఈ పిచ్‌పై ఫోర్త్ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి అదరగొట్టాడు.
బరిలోకి దిగిన తొలి బంతి నుంచి ఊచకోత కోశాడు ట్రావిస్ హెడ్. ఈ క్రమంలోనే యాషెస్ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 4 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన విధ్వంసకర ఓపెనర్‌గా హెడ్ రికార్డుల్లోకి ఎక్కాడు. బజ్‌బాల్‌కు అసలైన ఊచకోత ఏంటో రుచి చూపించాడు. కేవలం 69 బంతుల్లోనే తన సెంచరీ పూర్తీ చేశాడు హెడ్. యాషెస్ టెస్టులో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. ఓవరాల్ టెస్టు చరిత్రలో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఓపెనింగ్ బ్యాటర్‌గా హెడ్ రికార్డుల్లోకి ఎక్కాడు. అటు చేజింగ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది కూడా ఈ విధ్వంసకర బ్యాటర్‌నే. ఇక ట్రావిస్ హెడ్ సెంచరీతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. అప్పుడు టీమిండియాకి.. ఇప్పుడు ఇంగ్లాండ్‌కి హెడ్ నైట్‌మేర్ అని అంటున్నారు. అలాగే ’69’ నెంబర్ ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఊచకోతతో బాగా గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చారు.
Travis Head#Ashes2025 #TestCricket pic.twitter.com/Vu4Grkn11O
— Priyesh (@_priyeshh) November 22, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..