
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కాదని మీకు తెలుసా? సచిన్ కన్నా 13 సంవత్సరాల ముందే, 1997లో బెలిండా క్లార్క్ అనే ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఈ అరుదైన ఘనతను సాధించింది. ఆమె డెన్మార్క్‌పై 229 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
వివరాల్లోకి వెళ్తే.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మెన్స్ క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, వన్డే చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీని సచిన్ కన్నా ముందు ఒక మహిళా క్రికెటర్ కొట్టిన విషయం చాలా మందికి తెలియదు. 2010లో దక్షిణాఫ్రికాపై సచిన్ తన మొట్టమొదటి వన్డే డబుల్ సెంచరీని నమోదు చేశాడు. నిజానికి, ఇది అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో నమోదైన రెండో డబుల్ సెంచరీ.
సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును నెలకొల్పడానికి 13 సంవత్సరాల ముందు, 1997 ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ ఈ అరుదైన మైలురాయిని అధిగమించింది. డెన్మార్క్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బెలిండా క్లార్క్ 155 బంతుల్లో 229 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. తద్వారా, వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ఈ ఘనతతో బెలిండా క్లార్క్ తన పేరును చరిత్రలో లిఖించుకుంది.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..