ఉతికారేసిన ఆండ్రీ రస్సెల్..!

ఐపీఎల్‌లో భాగంగా ఆరంభంలో వరుస విజయాలతో ప్లేఆఫ్ రేసులో ముందు నిలిచిన కోల్‌కతా ఆ తర్వాత పేలవ బౌలింగ్, బ్యాటింగ్ కారణంగా వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఎంతలా అంటే.. పాయింట్ల పట్టికలో ఒకానొక దశలో టాప్-2లో కొనసాగిన ఆ జట్టు.. అనూహ్యంగా ఏడో స్థానానికి పడిపోయింది. హిట్టర్ ఆండ్రీ రసెల్‌ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. అతడ్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదు, ఆరు స్థానాలకే పరిమితం చేయడంతో కొన్ని మ్యాచ్‌ల్లో కోల్‌కతా భారీ స్కోరు అవకాశాల్ని చేజార్చుకుంది. […]

ఉతికారేసిన ఆండ్రీ రస్సెల్..!
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2019 | 5:14 PM

ఐపీఎల్‌లో భాగంగా ఆరంభంలో వరుస విజయాలతో ప్లేఆఫ్ రేసులో ముందు నిలిచిన కోల్‌కతా ఆ తర్వాత పేలవ బౌలింగ్, బ్యాటింగ్ కారణంగా వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఎంతలా అంటే.. పాయింట్ల పట్టికలో ఒకానొక దశలో టాప్-2లో కొనసాగిన ఆ జట్టు.. అనూహ్యంగా ఏడో స్థానానికి పడిపోయింది. హిట్టర్ ఆండ్రీ రసెల్‌ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. అతడ్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదు, ఆరు స్థానాలకే పరిమితం చేయడంతో కొన్ని మ్యాచ్‌ల్లో కోల్‌కతా భారీ స్కోరు అవకాశాల్ని చేజార్చుకుంది. దీంతో.. రెండు రోజుల క్రితం.. కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ నిర్ణయాలపై ఆండ్రీ రస్సెల్‌ బాహాటంగా విమర్శలు గుప్పించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుల ఆవశ్యకతని గుర్తు చేస్తూనే.. బౌలింగ్‌లోనూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని హెచ్చరించాడు.

రస్సెల్ వ్యాఖ్యలతో పునరాలోచనలో పడిన దినేశ్ కార్తీక్.. ఆదివారం రాత్రి ముంబయిపై మ్యాచ్‌లో అతడ్ని ఫస్ట్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కి పంపించాడు. దీంతో.. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రస్సెల్.. ఆఖరి బంతి వరకూ ముంబయి బౌలింగ్ దళాన్ని ఉతికారేశాడు. ఈ క్రమంలో మలింగ, బుమ్రా సహా ఎవరూ అతడ్ని నిలువరించలేకపోయారు. మలింగ వేసిన చివరి ఓవర్‌లో సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా.. రస్సెల్ తీయకుండా.. మొత్తం ఆరు బంతుల్నీ తనే ఆడి.. 6, 4, 4, 0, 0, 6 బాదేశాడు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు