Team India Pacer Akash Deep Injury: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వెటరన్ ఆటగాళ్ల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఓ యువ ఆటగాడి భవిష్యత్తుపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. యువ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ ఆస్ట్రేలియా పర్యటనలో రెండు మ్యాచ్ లు ఆడి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరస్‌లో అతను అంతగా ఆకట్టుకోలేదు. అలాగని విఫలం కూడా కాలేదు. ఆకాశ్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, వెన్ను గాయం కారణంగా అతను సిడ్నీ టెస్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు అతని గాయం, అతని టెస్ట్ కెరీర్ గురించి బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అతనిని హెచ్చరించింది.
బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, ‘ఆకాష్ పదేపదే గాయాల కారణంగా అతను ప్లేయింగ్ ఎలెవన్‌కి దూరంగా ఉంటే, అతనికి సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో కొనసాగడం కష్టం. 2019లో బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ముందు నుంచే వెన్ను గాయం ఆకాష్‌ను ఇబ్బంది పెట్టిందని బీసీసీఐ అధికారి తెలిపారు. ఆ అధికారి ప్రకారం, ఆకాష్ తన గాయం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
దాదాపు నెలన్నర పాటు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన సాగింది. ఆకాష్ జట్టుతో మొదటి నుంచి అనుబంధం ఉంది. వికెట్ల పరంగా అదృష్టం లేకున్నా.. ఆకాశ్ దీప్ సరైన లైన్ లెంగ్త్ లో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇక్కడ భారత జట్టు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో ఆడిన తర్వాత ఆకాష్‌కి అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఆకాష్ ఇప్పటివరకు మొత్తం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 35.2 సగటుతో 15 వికెట్లు తీశాడు.
గాయం కారణంగా ఆకాష్ సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ఆయనకు మరో పెద్ద షాక్ తగిలింది. దేశవాళీ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌లో బెంగాల్ తరపున ఆకాష్ ఆడాల్సి ఉంది. అయితే, గాయం కారణంగా అతను తప్పుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..