Asia Cup 2025 : మళ్లీ మొదటికొచ్చిందే.. అసలు భారత్, పాక్ మ్యాచ్ ఉంటుందా ? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. ఈసారి కూడా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ మ్యాచ్ గురించి చాలా సందేహాలు తలెత్తాయి. అయితే, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పుడు పరిస్థితిని స్పష్టం చేశారు.

Asia Cup 2025 : మళ్లీ మొదటికొచ్చిందే.. అసలు భారత్, పాక్ మ్యాచ్ ఉంటుందా ? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
India Vs Pakistan

Updated on: Sep 06, 2025 | 12:00 PM

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. ఈసారి కూడా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ మ్యాచ్ గురించి చాలా సందేహాలు తలెత్తాయి. అయితే, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పుడు పరిస్థితిని స్పష్టం చేశారు. భారత్-పాక్ మ్యాచ్ విషయంలో బీసీసీఐ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుందని, ఈ విషయంలో బోర్డుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు.

భారత్-పాక్ మ్యాచ్ పై బీసీసీఐ వైఖరి

పీటీఐ వీడియోకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సైకియా మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌తో మ్యాచ్ విషయంలో బీసీసీఐ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మేము కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాం. భారత ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. ఆ విధానాన్ని మేము పాటించాలి. ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని అనుసరించడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని అన్నారు.

శుభమన్ గిల్ కెప్టెన్సీపై స్పందన లేదు

ఇంటర్వ్యూ సందర్భంగా శుభమన్ గిల్‌కు మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉందా అని అడిగినప్పుడు, ఆయన ఈ విషయంలో వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. సైకియా మాట్లాడుతూ.. ‘ఇది సరైన సమయం కాదు. ఏ ఆటగాడి భవిష్యత్తు గురించి తొందరపడి ప్రకటనలు చేయకూడదు’ అని అన్నారు.

మహిళా ప్రపంచ కప్ పై ఆశలు

సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంకలో మహిళా వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ పెద్ద టోర్నమెంట్‌కు ముందు సైకియా ఆతిథ్య భారత మహిళా జట్టుపై నమ్మకం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా టీమ్ ఇండియా అద్భుతంగా ఆడుతోందని ఆయన అన్నారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా మహిళా జట్టు ప్రదర్శన బలంగా ఉందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ఆటగాళ్ళు నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నారని, గత 6-7 నెలలుగా తయారీపై పూర్తి దృష్టి పెట్టారని సైకియా చెప్పారు.

టికెట్ ధర రూ.100కి తగ్గింపు

మహిళా ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఒక ప్రత్యేక చర్య తీసుకుంది. ఎక్కువ మంది ప్రేక్షకులు స్టేడియాలకు వచ్చి మహిళా క్రికెట్‌కు మద్దతు ఇవ్వడానికి, టోర్నమెంట్ టికెట్ ధరను కేవలం రూ.100 కి తగ్గించారు. మహిళా క్రికెట్‌ను మరింత పాపులర్ చేయడమే దీని ఉద్దేశమని సైకియా అన్నారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..