బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గంగూలీకి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతనికి కరోనా నయం కాలేదు. కానీ ఇంట్లో చికిత్స జరుగుతుంది. భారత మాజీ కెప్టెన్‌కి ప్రస్తుతం తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయి. దీంతో అతడిని డిశ్చార్జి చేయాలని ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి.
BCCI ప్రెసిడెంట్ గంగూలీకి 3 రోజుల క్రితం కరోనా సోకింది. ఆ తర్వాత అతను వుడ్‌ల్యాండ్ హాస్పిటల్‌లో చేరాడు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్ అయ్యాడు. గంగూలీ ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాది ఇది రెండోసారి. జనవరి 2021లో, అతను గుండెపోటు సమస్య కారణంగా చాలా కాలం పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.
సౌరవ్ గంగూలీకి కరోనా సోకడానికి ముందు విరాట్ కోహ్లీతో విభేదాలు తలెత్తాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు, BCCI విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా చేసింది. కోహ్లీతో మాట్లాడిన తర్వాతే వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు. అయితే ఆ తర్వాత విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ చెప్పిన మాటలు గంగూలీ చెప్పినదానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. కెప్టెన్సీ తొలగించడానికి గంటన్నర ముందే ఈ విషయాన్ని తనకు తెలిపారని కోహ్లీ చెప్పాడు. విరాట్ ప్రకటనపై గంగూలీ స్పందిస్తూ.. బోర్డు ఇప్పుడు ఏం చేసినా ఈ అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పబోనని చెప్పాడు.
Read Also.. Ashes Series: నాలుగో టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ క్రికెటర్..